ఆడవాళ్ళు అన్నిటిలో సమానం అని ఎందుకు అన్నారో కానీ నేరాలు చేయడం లో కూడా వీరి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. వీళ్ళు చేస్తున్న నేరాలు పోలీసులను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. తెలంగాణ లో శిల్పా చౌదరి మరువక ముందే ఇప్పుడు మరో కేసు తల నొప్పిగా మారింది. అధిక వడ్డీ వస్తుందనే ఆశలు కలిగించి మరో మహిళ నమ్మించి దొచుకుంది. చివరికి మకాం మార్చెసింది. ఈ ఘటన ఏపి లో వెలుగులోకి వచ్చింది.

అనంతపురం పట్టణం లోని ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా పద్మశ్రీ పనిచేస్తున్నారు. అందరి తో నమ్మకంగా ఉండేది. అందరు నమ్మిన విషయం గ్రహించిన ఆమె సిగ్మాసిక్స్ ఎంటర్‌ ప్రైజెస్ పేరిట ఒక సంస్థ ను స్టార్ట్ చేసి అధిక వడ్డీ లను ఇస్తానని చెప్పి మాయ మాటలు చెప్పింది. అందరూ ఆమె మాట విని లక్షలు పోసారు. నెలకు 10 వేలకు వడ్డీ చెల్లిస్తానని నమ్మబలికింది. ఈవిడ మాటలను నమ్మిన చాలా మంది ఈమెకు డబ్బులు ఇచ్చారు.

అనుకున్న ఎమౌంట్ రాగానే రాత్రికి రాత్రే సర్దుకొని ఊరు వదిలి వెళ్ళింది. విషయం తెలుసుకున్న బాధిత మహిళలు ఆమె ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆందోళనకు దిగారు. నమ్మి మోస పొయామని గుండెలు బాధుకున్నారు. వడ్డీ వస్తుందని ఆశ పడి నగలను తాకట్టు పెట్టి ఇచ్చామని మహిళలు వాపొయారు. వెంటనే దగ్గర లోని పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు. జరిగిన విషయాన్ని వివరించారు. బాధితుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లిస్ట్ లోకి చాలా మంది మహిళలు రావడంతో పోలీసులు షాక్ అవుతున్నారు.. డబ్బుల కోసం కక్కుర్తి పడితే ఇదే జరుగుతుంది. ఇలాంటి వాటిని నమ్మి మోస పొవద్దని హెచ్చరించారు.. ప్రస్తుతం ఆ కీ లేడి ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: