ఇటీవలికాలంలో సెల్ఫీల పిచ్చి ప్రతి ఒక్కరిలో పెరిగిపోయింది. అందరికంటే భిన్నంగా కాస్త కొత్తగా ఫోటో తీసుకోవడం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎక్కువ లైకులు వస్తాయని భావిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా లైకుల ఊబిలో కూరుకుపోతున్న నేటి తరం యువత ఎంతో మంది కాస్త కొత్తగా ట్రై చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా ఘటనలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది  చిత్ర విచిత్రంగా సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటే మరి కొంత మంది మాత్రం ప్రత్యేకంగా ఫోటో షూట్ వెళ్తూ ఇక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం లాంటివి చేస్తున్నారు.


 సెల్ఫీ తీస్తేనేమి ఫోటో షూట్ కి వెళ్తేనేమీ అన్ని లైకులు కోసమే కదా. ఇలా సోషల్ మీడియాలో లైకుల కోసం ఎంతోమంది ప్రాణాలను కూడా పణంగా పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా ప్రమాదం పొంచి ఉంది అని తెలిసినప్పటికీ ఇక అలాంటి ప్రాంతాలలో ఫోటోలు దిగితే ఎక్కువ లైక్స్ వస్తాయని భావిస్తున్నారు ఎంతోమంది. చివరికి ఈ నిర్లక్ష్యం ప్రాణాలను గాల్లో కలిపేస్తుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఫోటోషూట్ కోసం వెళ్లారు ముగ్గురు యువకులు. ఇక ఇందులో ఒక యువకుడు అనుమానాస్పదంగా చెరువులో మునిగి మృతి చెందడం సంచలనంగా మారింది.


 పహాడి షరీఫ్ లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.  నాంపల్లి  చెందిన షేక్ అబ్దుల్ భాష చిన్న కుమారుడు షేక్ అబ్దుల్ నవీద్ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవలే అతని మిత్రులు రవి కాంత్ సిరాజ్ లతో కలిసి ఫోటోషూట్ కోసం జెల్ పల్లి హుందా సాగర్ కు చేరుకున్నాడు. ఈత కొడదామని ముగ్గురు చెరువులో దిగగా.. ప్రమాదవశాత్తు నవీద్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఇద్దరు స్నేహితులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండాపోయింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్లు సహాయంతో నవీద్ మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: