ఇటీవల కాలంలో మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తూ ఏదో ఒక విధంగా డబ్బులు దండు కుంటూన్న కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతుంది.  ఈ క్రమంలోనే ఇక ఇలాంటి మోసగాళ్ల బారినపడకుండా ఉండేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే పోలీసులు చెప్పే మాటలను జనాలు ఎంతో గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇదే విషయాన్ని క్యాష్ చేసుకోవాలి అనుకుంది ఇక్కడొక మాయలేడి.


 దీంతో ఇక పోలీసుల అందరికీ నమ్మించేందుకు ఖాకీ డ్రెస్ వేసుకొని పోలీస్ అవతారం వేసింది. ఏ పోలీసు కేసుల్లో ఇరుక్కున్న వాహనాలను తక్కువ  ధరకు ఇప్పిస్తాను అంటూ మాయమాటలతో పలువురు దగ్గర లక్షలరూపాయలు తీసుకుంటూ ఉండటం మొదలు పెట్టింది. ఇక నకిలీ పోలీస్ ఇంత చేసిన తర్వాత నిజమైన పోలీసులు ఊరుకుంటారా ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు. ఈ ఘటన వేలూరు లో వెలుగులోకి వచ్చింది. రోహిణి అనే 32 ఏళ్ల మహిళ కాంచీపురం జిల్లాలో భర్తతో కలసి నివసిస్తుంది.


 అయితే రాణి పేట జిల్లా ఆర్కాడు సమీపంలో ఉండే దినేష్ కుమార్ కు ఓ స్నేహితుని ద్వారా రోహిణి పరిచయం అయ్యింది. ఈ క్రమంలోనే తాను మహిళా ఎస్సై అంటూ పోలీస్ దుస్తుల్లో ఉన్న ఒక నకిలీ గుర్తింపు కార్డును దినేష్ కుమార్ కు చూపించింది రోహిణి. ఈ క్రమంలోనే కాస్త పరిచయం పెరిగాక పోలీసు కేసుల్లో చిక్కున్న వాహనాలను కార్లను తక్కువ ధరకు ఇస్తాను అంటూ అతడిని మాయమాటలతో నమ్మించింది. ఈ క్రమంలోనే అతని దగ్గర నుంచి 14 లక్షల రూపాయలు తీసుకుంది. అంతేకాదు చెన్నైకి చెందిన సెంతిల్, వేలూరు కు చెందిన కుమార్ అనే వ్యక్తులను కూడా దినేష్ రోహిణి పరిచయం చేయడంతో వారి వద్ద నుంచి ఐదు లక్షలు కాజేసింది. కానీ ఆ తర్వాత పత్తా లేకుండా పోయింది. దీంతో మోసపోయానని గ్రహించిన దినేష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇక నిందితులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే సదరు మహిళ పై వివిధ పోలీస్స్టేషన్లలో 14 కేసులు ఉన్నాయని గుర్తించారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: