టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో హీరో గా నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటికే సందీప్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని ఈ మూవీ షూటింగ్ను ప్రారంభించడానికి రెడీ గా ఉన్నాడు. ఈ సినిమాలో మొదట ప్రభాస్ కి జోడిగా దీపికా పదుకొనే ను హీరోయిన్గా తీసుకోవాలి అని సందీప్ అనుకున్నాడు.

అందులో భాగంగా ఆమెను సంప్రదించి కథను కూడా వివరించగా ఆమె అనేక కండిషన్స్ పెట్టడంతో ఈ మూవీ లో ఆమెను హీరోయిన్గా తీసుకోవద్దు అని సందీప్ డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీలో యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించిన తృప్తి డిమ్రి ని హీరోయిన్గా ఎంచుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో రెండవ హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతున్నట్లు , ఆ పాత్ర కూడా సినిమాలో అత్యంత ఈ రకంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో రెండవ హీరోయిన్ ని కూడా సందీప్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

స్పిరిట్ మూవీ లో రెండవ హీరోయిన్గా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి మాడోనా సబాష్టియన్ ఓకే అయినట్లు , ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమా కథను వివరించగా , ఆమె కూడా ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్త అవుతుంది. ఒక వేళ నిజం గానే ఈమెకు స్పిరిట్ మూవీcలో హీరోయిన్గా అవకాశం వస్తే అది ఈమెకి సూపర్ సాలిడ్ క్రేజీ ఛాన్స్ అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: