నేటి కాలంలో మంచి అనేదానికి రోజులు లేకుండాపోయాయి. ఎందుకంటే ఎవరికైనా మంచి చేయాలని వెళ్లిన.. వాళ్లు మాత్రం మనకి కీడు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ఇలాంటి సంఘటనలు చేసినా ఎవరిదారిన వారు వెళ్లడం తప్ప పాపం అంటే మాత్రం ఎన్నో ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సాధారణంగా రోడ్డుపైన ఎవరైనా గొడవ పడుతున్నారు అంటే అసలు ఏం జరిగింది అన్న విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు అందరూ. ఇక అక్కడ జరిగిన విషయం తెలిసిన తర్వాత గొడవ పడకూడదు అంటూ అందరికీ సర్దిచెప్పే ప్రయత్నం కూడా చేస్తారు మరికొందరు.



 ఇక ఇది సర్వ సాధారణంగా జరిగేదే. ఇలా సర్దిచెప్పడానికి వెళ్లడమే అతని పాలిట శాపంగా మారి పోయింది. గొడవ జరుగుతుంటే వారిని ఆపేందుకు వెళ్లిన వ్యక్తి ని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలి లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో నిందితుడు పరారీలో ఉన్నాడు అనే పోలీసులు గుర్తించారు. తిరునల్వేలి లోని పనగుడి పట్టణానికి చెందిన కలైచెల్వాన్ అనే  వ్యక్తి  పెట్రోల్ బంకు వెళ్లగా అక్కడ ఓ ముఠా  సిబ్బందిపై దాడి చేయడం చూశాడు.


 పెట్రోల్ బంకులో రిగ్గింగ్ జరుగుతోంది అంటూ ఆరోపిస్తూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు నలుగురు వ్యక్తులు. ఒకరిని ఒకరు కొట్టుకోవడం కూడా చేశారు. ఇది గమనించిన కలై సెల్వన్ అనే వ్యక్తి గొడవ ఆపడానికి వెళ్ళాడు. ఇరువర్గాలను వేరు చేయడానికి ప్రయత్నించాడు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది తో గొడవ పడుతున్న ముఠా అతని వైపు దృష్టి మరల్చి చుట్టుముట్టి దారుణంగా కొట్టడం మొదలు పెట్టింది. ఇక పెట్రోల్ బంక్ సిబ్బంది అతని రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. చివరికి అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలసుబ్రమణ్యం,ఆటో కుమార్, శివరామన్ లను అరెస్టు చేశారు. ఇక మనిష్ రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: