ఇటీవల కాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది బాసు. దొంగలను పట్టుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇక ఇలా సీసీ కెమెరాల ద్వారా ఇక ఎక్కడైనా దొంగతనం జరిగితే ఇట్టే దొంగలను పట్టుకోవచ్చు అని పోలీసులు ప్లాన్ వేశారు. ఇక పోలీసుల ఎత్తులకు పైఎత్తులు వేయడమే దొంగల పని. ఇలా సరికొత్తగా ఆలోచిస్తూ ఏకంగా పోలీసు లకు షాక్ ఇస్తున్నారు ఇటీవల కాలంలో ఏకంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి.


 అది ఇది అని తేడా లేదు అన్ని రకాల దొంగతనాలకు పాల్పడుతూ చివరికి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దీంతో ఇక ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటే అని అందరూ భయపడిపోతున్నారు. ఇక ఇంటి బయట వాహనాలను పార్క్ చేయాలంటేనే వణికిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏది దొరకనట్టు ఏకంగా ఒక ఆర్టీసీ బస్సు దొంగలించారు. ఇక ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఇక ఈ బస్సు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


 చివరికి ఈ బస్సు ఆచూకీ లభించింది అనేది తెలుస్తుంది. అంపురంలో ఇటీవలే దొంగలించిన ఆర్టీసీ అద్దె బస్సు విజయనగరంలో రైల్వే స్టేషన్ వద్ద గుర్తించారు పోలీసులు. కంచిలి మండలం రాంపురం మెకానిక్ షెడ్ వద్ద ఉంచిన బస్సు దొంగలు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే విజయనగరంలో సదరు అద్దె ఆర్టీసీ బస్సును  గుర్తించారు పోలీసులు. అయితే ఇక బస్సును దొంగలించిన వెంకటరామారావు, వెంకటరావు త్రినాధ రావు, రమణ లను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: