సాధారణంగా న్యాయస్థానాలకు ఎప్పుడూ చిత్రవిచిత్రమైన కేసులు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఇలాంటి విచిత్రమైన కేసులలో అటు కోర్టులు ఇచ్చే తీర్పులు మరింత హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇటీవలే ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. సంతానం పొందే హక్కు కింద కోర్టుకెక్కింది. ఇక భర్తతో కాపురం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరింది. అదేంటి భర్తతో కాపురం చేసుకునెందుకు కోర్టు అనుమతి ఎందుకు అని అనుకుంటున్నారు కదా. సదరు మహిళ భర్త ఏకంగా జైలులో శిక్ష అనుభవిస్తూ ఉండటం గమనార్హం. తన భర్తతో తనకు పిల్లలు కనాలని ఉందని కాపురం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కింది సదరు మహిళ. ఈ ఘటన కాస్తా సంచలనంగా మారిపోయింది.


 నందు లాల్ అనే 34 ఏళ్ల వ్యక్తి ఓ కేసులో అజ్మీర్ జైలులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే తమకు పిల్లలు కావాలని అందుకు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలంటూ నందు లాల్ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై  విచారణ జరిపిన కోర్టు ఇక వాదనలు విన్న తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ఇక అన్ని మతాల్లో కూడా ఆడపిల్లలకు పిల్లలు కనే హక్కు ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక సాంప్రదాయాలను గౌరవించే మన దేశంలో పిల్లలను కనడం గృహిణి హక్కు కాబట్టి నందు లాల్ కి 15 రోజులపాటు పెరోల్ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించడం సంచలనం గా మారిపోయింది.


 అయితే నందు లాల్ కి గతంలో కూడా కోర్టు పెరోల్ మంజూరు చేయడం గమనార్హం.  2021 మొదట్లో పెరోల్ మంజూరు చేయగా ఆ టైంలో అతని ప్రవర్తనని సక్రమంగా ఉండటం కారణంగా  మళ్ళీ ఇప్పుడు పెరోల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు వివరణ ఇచ్చింది. నేరం చేసింది సదరు మహిళ భర్త అలాంటప్పుడు ఒక మహిళ ఎందుకు శిక్ష అనుభవించాలని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అందుకే ఆమెకు సంతానం పొందే హక్కులు ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ ఇక ఆమె భర్తను విడుదల చేయడానికి నిర్ణయించుకున్నట్లు కోర్టు వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: