భార్య భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా నీడగా నిలుస్తూ పాలుపంచుకోవాలి. ప్రతి ఒక్కరు అమితమైన అభిమానాన్ని ప్రేమను చూపిస్తూ ఉండాలి. కానీ ఇటీవలి కాలం లో మాత్రం భార్య భర్తల బంధం లో అన్యోన్యత కాదు అనుమానాలు మనస్పర్థలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంత మంది భార్యా భర్తల బంధానికి విలువ ఇవ్వకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటే మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న భార్యపై అనుమానం తో దారుణాలకు పాల్పడుతున్నారు.


 ఇలా నేటి రోజుల్లో జనాలు భార్యా భర్తల బంధానికి ఎక్కడ విలువ ఇవ్వడం లేదు అన్నది అర్ధమవుతుంది. ఇక్కడ ఓ భర్త ఏకం గా భార్య పై అనుమానం పెంచుకుని అర్ధరాత్రి సమయం లో దారుణం గా హతమార్చాడు. ఈ ఘటన చిక్కబల్లపురలో వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అరవింద్, మమత భార్యా  భర్తలు. వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు. అరవింద్ పానీపూరి షాపులో పని చేస్తూ ఉండేవాడు. గత కొంత కాలం నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడుతూ సూటిపోటి మాటలు అనేవాడు.


 శనివారం అర్ధరాత్రి సమయం లో కూడా భార్య తో గొడవ పెట్టుకున్నాడు అరవింద్. ఈ క్రమం లోనే మాటా మాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య తలను నేలకేసి పదేపదే కొట్టాడు. దీంతో నోట్లో నుంచి చెవిలో నుంచి రక్తం కారి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ క్రమంలోనే స్థానికుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకొని జైలుకు తరలించారు  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇక పిల్లలిద్దరు కూడా దిక్కు లేని వారిగా మిగిలిపోయారు. 

ఈ ఘటన స్థానికంగా సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: