ఇటీవలికాలంలో ఎక్కడ చూసిన దొంగల బెడద పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే . తాళం వేసిన ఇళ్లు కనిపించాయి అంటే చాలు ఏకంగా అందినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. ఈ క్రమంలో నేటి రోజుల్లో ఇక ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అటు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది అని చెప్పాలి. అయితే దొంగతనాలు చేసే వారు ఒక్కొక్కరు ఒక్కో స్టయిల్ లో ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఎలాంటి ప్లాన్ వేసుకున్నప్పటికీ దొంగతనం చేయడానికి వెళ్ళిన వారు ఎప్పుడూ ఎంత అలర్ట్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఎంతో చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశించడం ఆ తర్వాత విలువైన వస్తువులు ఎక్కడ ఉన్నది అనే విషయాన్ని గమనించటం.. చివరికి దొంగతనం చేసి అందినకాడికి దోచుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొంత మంది దొంగలు మాత్రం ఇక ఎంతో కష్టపడి ఇంట్లోకి చొరబడిన తర్వాత తాము దొంగతనానికి వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారు.  చోరి చేయడం మర్చిపోయి ఏకంగా దొంగతనం చేయటం కాదు హాయిగా నిద్ర పోవడం లాంటివి చేస్తూ ఉంటారు. చివరికి  పోలీసులకు దొరికిపోతు ఉంటారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. దొంగతనం చేయడానికి వచ్చిన ఒక దొంగ చివరికి నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర పోతే పోయాడు కానీ గట్టిగా గురక పెట్టాడు. ఇంకేముంది పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం లో జరిగింది. వ్యాపారి సత్తి వెంకటరెడ్డి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్లగా వీరబాబు అనే దొంగ ఆయన్ను ఫాలో అయి చాకచక్యంగా ఇంట్లోకి చేరుకున్నాడు. అయితే వెంకట్రెడ్డి లెక్కలు ముగించుకుని వచ్చేసరికి రాత్రి 11 అయ్యింది. ఆ లోపు సూరిబాబు నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలోకి జారుకున్న తర్వాత గురక పెట్టడంతో ఆ శబ్దానికి గమనించిన వెంకట్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించి అతని పట్టించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: