నేటి రోజుల్లో మనుషులు ఆలోచన తీరు ఎలా ఉందంటే ప్రతి చిన్న సమస్య కి సొల్యూషన్ ఒకటే అన్న విధంగా ఆలోచిస్తున్నారు. సొల్యూషన్ ఏంటో కాదు ఏకంగా ఆత్మహత్య. అవును ఇటీవలి కాలంలో ఎంతోమంది చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గట్టిగా తలుచుకుంటే  తీరిపోయే సమస్యలకు ఇక అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కోలాపూర్ సరిత అనే 22 ఏళ్ల యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.



 అంతేకాదు ఆ యువతి తీసుకున్న నిర్ణయం ఆమె తల్లిదండ్రులను అరణ్యరోదన లోకి నెట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన సరితా ఆత్మహత్యకు పాల్పడగ  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సరిత ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మధ్యాహ్నం రెండు గంటల పాటు సెల్ఫోన్లో ఎవరితోనూ మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. సెల్ ఫోన్ లో గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడింది అంటూ చెబుతున్నారు. అయితే ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టింది సరిత.


 తండ్రి రేషన్ బియ్యం తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఇక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది  ఈ క్రమంలోనే రేషన్ బియ్యం తీసుకుని ఇంటికి వచ్చేసరికి కూతురు ఇంట్లో దూలానికి వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా ఆయన గుండె పగిలిపోయింది. తన కూతురును అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేదింపులకు పాల్పడటం కారణంగానే ఆత్మహత్య చేసుకుందని బాధిత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే  మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: