ఇటీవల కాలం లో పెళ్లి చేసుకుని హాయిగా దాంపత్య జీవితాన్ని గడపాల్సిన వారు చిన్నచిన్న కారణాలకే ఏకంగా భార్యాభర్తల బంధం లో చేజేతులారా చిచ్చు  పెట్టుకుంటున్నారు. ముఖ్యం గా త్రిబుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేకమైన చట్టం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా త్రిబుల్ తలాక్ అని చెప్పి భార్యలను వదిలించుకునే జడ్యాం మాత్రం పోవడం లేదు అన్నది నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూస్తే అర్థమవుతుంది. చిత్ర విచిత్రమైన కారణాలతో ఇటీవల కాలం  లో ఎంతో మంది త్రిబుల్ తలాక్ చెప్పేస్తున్నారు.


 కట్నం పెట్టలేదని కొంత మంది అదనపు కట్నం తీసుకు రాలేదని ఇంకొంత మంది మగ పిల్లవాడు పుట్ట లేదని మరి కొంత మంది పెళ్లి చేసుకోవానె దుర్బుద్ధితో ఇంకొంత మంది త్రిబుల్ తలాక్ చెబుతూ చివరికి భార్యలను వదిలించు కుంటున్నారు. ఇక ఇటీవలే ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. లక్ష రూపాయల కట్నం తీసుకున్న అతగాడికి కారు ఇవ్వలేదని భార్యకు ఫోన్ చేసి త్రిపుల్ తలాక్ చెప్పాడు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పాడు. భర్త తీరుతో ఒక్క సారిగా షాక్ అయిన భార్య న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.


 భర్త తనకు త్రిబుల్ తల చెప్పాడని కారు కొనివ్వలేదని అలా చేశాడని.. ఇక ఇప్పుడు భర్త అత్తమామలు ఇంటికి రానివ్వడం లేదని.. ఎలాంటి సంబంధం లేదు పొమ్మంటున్నారు అంటూ పోలీసుల ముందు తన బాధను వ్యక్తపరిచింది బాధితురాలు. భర్త సహా మరో ఐదుగురిపై ఫిర్యాదు చేసింది. ఇక ఇలా రూబీనా దగ్గర నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు భర్త ఇమ్రాన్ ను అరెస్టు చేశారు. కాగా 2017లో వీరికి వివాహం జరిగగా నాలుగు సంవత్సరాల పాప కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: