మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకు వచ్చి ప్రాణాలు తీస్తుంది అన్నది ఊహకందని విధంగానే ఉంటుంది అని చెప్పాలి. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి నిమిషాల వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి చేరుస్తూ ఉంటాయి. అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా కాస్తయినా జాలి చూపని విధి చివరికి అల్లారు ముద్దుగా పిల్లలను పెంచుకున్న తల్లిదండ్రులకు కడుపుకోతను మిగులుస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఎంతో హుషారుగా స్కూలుకు రెడీ అయ్యి ఆటోలో ఎక్కాడు ఆ బాలుడు. ఇక మమ్మీ నేను స్కూల్ కి వెళ్తున్నాను అంటూ టాటా చెప్పాడు. కానీ ఇలా బయలుదేరిన కాసేపటికి చివరికి ఆ తల్లిదండ్రులకు మృత్యు వార్త వినపడింది. దీంతో ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయింది. వేగంగా వెళుతున్న ఆటో నుంచి కిందపడి సిద్దిపేట జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన జశ్వంత్ అనే పదేళ్ల బాలుడు మృతి చెందాడు. వివరాలు లోకి వెళ్తే.. వేల్పూరు గ్రామంలో ఉంటున్న నాగరాజు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


 వ్యవసాయం చేసుకుంటూ  కుటుంబం జీవనం సాగిస్తుంది. అయితే ఇద్దరు పిల్లలను కూడా బుర్ర గూడెం ప్రాథమిక పాఠశాలకు పంపిస్తున్నారు. ఐదో తరగతి చదువుతున్న జస్వంత్ రోజు మాదిరిగానే పాఠశాలకు ఆటోలో బయలుదేరాడు. కాగా అనంతగిరిపల్లి గ్రామం దాటుతుండగా ఆటోలో ఉన్న ఒక కప్ప ఎగిరి డ్రైవర్ పక్కన కూర్చున్న జస్వంత్ వద్ద పడింది. దీంతో అతను ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఇక వేగంగా వెళుతున్న ఆటోలో నుంచి కింద పడిపోయాడు. దీంతో తల చేతులకు గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇక అక్కడ ప్రథమ  చికిత్స చేసిన వైద్యులు హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. కానీ హైదరాబాద్ వెళ్లేసరికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిరతరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: