హైదరాబాద్ లో ఓ క్రైమ్ లవ్ స్టోరీ వెలుగు చూసింది.. ఓ యువతి.. తన మొదటి ప్రియుడ్ని, రెండో ప్రియుడి తో కలిసి భవనంపై నుంచి తోసేసి హత్యాయత్నం చేసింది. ఇప్పుడు అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.. ఇది ఇప్పుడు నగరంలో సంచలనంగా మారిందీ.. ఈ ఘటన పై అలర్ట్ అయిన పోలీసులు విచారణను చేపట్టారు.. ఇక విషయానికొస్తే..



భాగ్యనగరం లో పెను సంచలనం సృష్టిస్తోంది. లు, సీరియల్స్‌ లో చిన్నాచితకా క్యారెక్టర్లు చేసుకునే నాగవర్థి ని, సూర్య నారాయణ ఒకప్పడు ప్రేమికులు. ఇద్దరూ కృష్ణానగర్‌ లోని ఓ అపార్ట్‌మెంట్‌ లో సహజీవనం కూడా చేస్తున్నారు. ఒకరోజు సూర్యనారాయణ తన స్నేహితుడు శ్రీనివాస్‌ రెడ్డిని నాగవర్థిని కి పరిచయం చేశాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో కానీ, నాలుగు నెలలుగా సూర్య నారాయణకు దూరంగా, శ్రీనివాసరెడ్డి కి దగ్గరగా మసలుతోందామె. ఈ బ్రేకప్‌ తర్వాత శ్రీనివాస్‌, నాగవర్థిని కలిసి అదే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు.



సూర్య నారాయణ అదే బిల్డింగ్‌ లోని పై ఫ్లోర్‌ కి మారాడు. తాజాగా సూర్య నారాణకు, ఈ జంట కు మధ్య వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా ముదిరి.. ఆ జంట ఇద్దరూ కలిసి సూర్య నారాయణన ను బిల్డింగ్ పై నుంచి తోసేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ లో అసలు వివాదం ఎందుకొచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అందుకే పెద్దలు అంటారు గొప్పల కు పోయి తిప్పలు తెచ్చుకోవడం అని.. అబ్బాయిలు బీ అలర్ట్ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు ఆలోచించండి.. డబ్బుల కోసం కూడా అమ్మాయిలు ఊసరవెల్లి లా మారుథున్నారు.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త సుమీ.. లేకుంటే మన చాప్టర్ సగంలోనే ముగిసి పోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: