ఇటీవల కాలం లో మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుంది అన్నది కూడా చెప్పలేని విధం గానే మారి పోయింది. సాధారణం  గా ఒక వ్యక్తి ఇక వృద్ధాప్యం లోనే కేవలం అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోతాడు అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలం లో మాత్రం యువకుల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరు ఎప్పుడు ప్రాణాలు కోల్పోతారు అన్నది తెలియని విధంగా మారిపోయింది. ముఖ్యంగా ఆరోగ్యంగానే ఉన్నారు అనుకున్న సమయంలో ఎంతోమంది క్షణాల వ్యవధిలో మృత్యువాత పడుతున్నారు. ఇంకొంతమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి.


 చిన్నచిన్న కారణాలకి అక్కడితో ఇక తమ జీవిత ముగిసిపోయింది అని భావిస్తున్న ఎంతోమంది చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తూ ఉన్నారు. ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతోమంది చివరికి కుటుంబంలో విషాదాన్ని నింపుతూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా భర్త తనను పట్టించుకోవడం లేదు అని భావించిన భార్య  కఠిన నిర్ణయం తీసుకుంది.


 ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసింది. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి పంచాయతీ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మరాజు పల్లి కి చెందిన భాష బోయిన తేజశ్రీ అదే గ్రామానికి చెందిన యశ్వంత్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచి భర్త ముఖం చాటేయడంతో.. ఇక తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఇటీవల ఇక తన జీవితం నాశనమైంది అంటూ మనస్థాపం చెంది విషం తాగింది. చివరికి కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా కొనప్రాణలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: