ఇటీవల కాలంలో నేరస్తులు సినిమాలను చూసి ప్రభావితం అవుతున్నారా లేకపోతే దర్శక నిర్మాతలు ఇక నేరస్తులళా ఆలోచిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదు. కానీ ఇటీవల కాలంలో ఏకంగా సినిమాల్లో కనిపించిన సన్నివేశాలె అటు నిజజీవితంలో కూడా రిపీట్ అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. సినిమాలలో ఎక్కువగా సిబిఐ అధికారుల పేరుతో ఎంతో మంది నకిలీ హోదాలు  నిర్వహించి ఇక చోరీలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇక ఇలాంటివి నిజజీవితంలో జరగడం అసాధ్యం అనుకుంటారు అందరూ. కానీ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 సాధారణంగా సిబిఐ అధికారులు సోదాలకు వచ్చారు అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ భయం లో దేని గురించి ఆలోచించరు. కేవలం ఏదైనా  అధికారులకు చిక్కుతుందేమో అని భయపడిపోతూ ఉంటారు. ఇక ఇలా సిబిఐ పట్ల అందరికీ ఉన్న భయాన్ని క్యాష్ చేసుకున్న కొంతమంది కేటుగాళ్లు ఏకంగా సోదాల పేరుతో చోరీకి పాల్పడ్డారు. పశ్చిమబెంగాల్లోనే భవానీపూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సోదాల పేరుతో వచ్చి 30 లక్షలు నగదు ఆభరణాలు దోచుకు వెళ్లారు. ఇక ఆ తర్వాత ఈ విషయంపై బాధితుడు పోలీసులు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


 వ్యాపారవేత సురేష్ వాద్వ ఇంటికి ఉదయం 8 గంటల సమయంలో 8 మంది మూడు కార్లలో వచ్చారు. ఇక వాళ్ళ వాహనాలపై పోలీసు స్టిక్కర్లు ఉండడం సురేష్  గమనించారు. సిబిఐ అధికారులు అంటూ చెప్పి ఇంట్లోకి వచ్చి సోదరులను నిర్వహించడం మొదలుపెట్టారు. అయితే సురేష్ వాద్వా ఐడి కార్డు చూపించమని అడిగిన వాళ్లు మాత్రం చూపించలేదు. ఇక ఇలా వచ్చిన ఎనిమిది మంది ఇల్లంతా సోదాలు చేసి 30 లక్షల నగదు కొన్ని లక్షల విలువైన బంగారాన్ని సీజ్ చేస్తున్నామంటూ చెప్పి తమతో పాటు తీసుకెళ్లా.రు ఇక విచారణకు హాజరు కావాలన్న సమన్లు తర్వాత పంపిస్తామని చెప్పి ముఠా వెళ్లిపోయినట్లు సురేష్ తెలిపాడు. ఇక తర్వాత మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: