సాధారణంగా బీటెక్ లు, డిగ్రీలు లాంటివి చదివి పట్టా పొందిన వారు ఎక్కడైనా మంచి ఉద్యోగం సాధించడం కోసం తెగ వెతుకులాట ప్రారంభిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో ఎన్నో ఆప్షన్లు ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల కోసం ఇబ్బంది పడాల్సిన పని లేకుండా పోయింది. కాగా ఎంతోమంది సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్న వారిని కూడా చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది మాత్రం ఎందుకో పెద్ద చదువులు చదివినప్పటికీ కూడా ఉద్యోగాలు చేయడం కాదు నేరాలు చేయడం వైపు అడుగులు వేస్తూ ఉండడం ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తుంది. ఏకంగా చెడు వ్యసనాలకు బానిసలుగా మారిపోతూ చివరికి నేరాలకు పాల్పడేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు.


 వెరసి నేటి రోజుల్లో ఎక్కడ చూసినా నువ్వు నేరాలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ యువకుడు బీటెక్ చదివి సవ్యంగా ఉద్యోగం చేసుకోకుండా చివరికి అడ్డదారులు తొక్కాడు. చివరికి పోలీసులకు చికి జైలు పాలు కావాల్లసిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా చెడు వ్యసనాలకు  బానిసలగా మారిపోయి డబ్బులు బీటెక్ చదివిన వ్యక్తి లారీల నుంచి డీజిల్ చోరీ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఓ రోజు లారీ డ్రైవర్లకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇంకేముంది అతనికి దేహశుద్ధి చేసిన లారీ డ్రైవర్లు పోలీసులకు అప్పగించారు.

 చీమకుర్తిలో ఉండే వంజా విక్రమ్ అనే యువకుడు బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు. అయితే చెడు వ్యసనాలకు బానిసగా మారిపోయాడు. దీంతో జీతం గా వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో సొంతూరు కు చెందిన యువకులతో ముఠాగా ఏర్పడి గ్రానైట్ పరిశ్రమ విస్తరించిన చీమకుర్తి ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకున్నాడు. రాత్రి వేళల్లో అక్కడ నిలిపి ఉండే లారీల నుంచి చాకచక్యంగా డీజిల్ చోరీ చేసి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఓ రోజు లారీ డ్రైవర్లు నిఘా వేసి ఈ ముఠా సభ్యులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రెడ్ హ్యాండెడ్ గా విక్రమ్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: