
ఇప్పటికే చిన్న చిన్న కారణాలకు సాటి మనుషులు ప్రాణాలు తీస్తున్న క్రూర మృగాల్లాంటి మనుషులు కనిపిస్తున్న నేటి సభ్య సమాజంలో ఎంతోమంది ఇక చిన్న చిన్న కారణాలకే వారి ప్రాణాలను వారే చేజేతులారా తీసుకుంటూ ఇక జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లి కావడం లేదని మనస్థాపనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి.
తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని మనస్థాపం చెందిన ఒక యువకుడు.. చివరికి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. హవేలీ ఘనపూర్ మండలం లోని శ్యామ్నాపూర్ గ్రామం లో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన జోగేల్లి సుజాత, రాజు దంపతులకు కుమారుడు నవీన్ అనే 21 ఏళ్ళ యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. అయితే తనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులను గత కొన్ని రోజుల నుంచి అడుగుతూ వస్తున్నాడు. చదువు పూర్తయి ఉద్యోగం వచ్చేంతవరకు ఆగాలి అంటూ తల్లిదండ్రులు అతని మందలించారు. దీంతో మనస్థాపం చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.