
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. సాధారణం గా ఒక డాక్టర్ అన్న తర్వాత మనుషుల ప్రాణాలను కాపాడాలి. ఇటీవల కాలం లో ఎంతో మంది ఆర్ఎంపీ డాక్టర్లు క్లినిక్లు ఏర్పాటు చేసుకుని ఇక వైద్యం అందిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ఇక్కడ ఓ ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇలాగే ఎంతోమందికి చికిత్స అందిస్తూ మనుషుల మధ్య ఉన్నాడు. కానీ ఎందుకో మానవమృగంలాగా మారిపోయాడు. అభం శుభం తెలియని ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు అని చెప్పాలి.
ఈ ఘటన నారాయణపేట జిల్లా లో వెలుగు లోకి వచ్చింది. ధన్వాడ మండలం ఎంనన్ పల్లి గ్రామానికి చెందిన వివాహితుడైన అబ్దుల్ నబీ ఆర్ఎంపీ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. నర్వ మండలం లోని ఓ గ్రామం లో ఇలా క్లినిక్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ క్రమం లోనే ఇటీవల అతని కన్ను ఒక బాలికపై పడింది. ఇక ఆరోగ్య సమస్యల తో బాలిక తన క్లినిక్ కి వచ్చినప్పుడల్లా మాయ మాటలు చెప్పి చివరికి మచ్చిక చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకుని దారుణం గా అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నాళ్ళకి స్థానికులకు ఈ విషయం తెలిసింది. దీంతో అతన్ని చితకబాలి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అయితే ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపు లోకి తీసుకున్నారు.