నా పేరు ముఖేష్.. ఇది వినగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తుకు వస్తుంది. సినిమా థియేటర్కు వెళ్లిన తర్వాత సినిమా స్టార్ట్ కావడానికి ముందు టైటిల్స్ పడటానికి ముందు.. పొగాకు ఎంత ప్రమాదకరమైనది అన్న విషయం తెలియజేసేందుకు ఇక ఈ నా పేరు ముఖేష్ యాడ్ వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి థియేటర్లో కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ను అటు ప్రభుత్వం తప్పని సరి చేసింది. నేను ఒక సంవత్సరం గుట్కా నమిలాను. కానీ ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది అంటూ దీనంగా ముక్కుకి పైప్ పెట్టుకుని ముఖేష్ అనే వ్యక్తి కనిపిస్తాడు.


 ఇక ఇప్పుడైతే ముఖేష్ యాడ్ ను తొలగించి సునీత అనే మరో మహిళకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ని థియేటర్లలో వేస్తున్నారు. అయితే ఇక ఇదే అడ్వర్టైజ్మెంట్ను మిమిక్రీ చేసి ఎంతోమంది నవ్వుకున్న వారు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇంతకీ అసలు ముఖేష్ కథ ఏంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఆ వివరాలు చూసుకుంటే.. ముఖేష్ ది  మహారాష్ట్రలోని భూసావల్ అనే ఒక చిన్న పట్టణం. ఇక వారి కుటుంబం మొత్తం రోజువారి కూలీలే. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.



 ముఖేష్ కూడా రోజువారి కూలిగానే పనిచేస్తూ ఉండేవాడు. స్నేహితుల ద్వారా అతనికి గుట్కా నమలడం అలవాటయింది. ఆ తర్వాత అది ఒక వ్యసనంగా మారిపోయింది. ఇక గుట్కా నమలడంతో అతనికి నోటి క్యాన్సర్ వచ్చిందట. అయితే ఇలా పొగాకు కారణంగా ఎంతోమంది గొంతు క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలుసుకున్న భారత ప్రభుత్వం.. ఇక అందరినీ భయపెట్టేలా ఒక యాడ్ ప్రసారం చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఈ యాడ్ ఫిలిం కోసం షూట్ చేసేటప్పుడు అతని పలకరిస్తే గుట్కా తినడం మొదలుపెట్టినప్పుడు.. తన తల్లి తనను కొట్టిందని.. తాను ఆమె సలహాను పట్టించుకోకుండా ఏడాది పాటు గుట్క నమిలితే.. నోటి క్యాన్సర్ వచ్చిందని ముకేశ్ చెప్పుకొచ్చాడు. ముఖేష్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేస్తే అందరూ గుట్కా, తంబాకు, పొగాకు లాంటివి మానేస్తారని ప్రభుత్వ నిర్ణయించుకుని యాడ్ షూట్ చేశారు. అయితే 2009లో ముఖేష్ మరణించాడు. ఇక 2012లో నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టోబాకో ఎరాడికేషన్  థియేటర్లలో కూడా ముఖేష్ యాడ్ ని ప్రదర్శించడం తప్పనిసరి చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: