ఇటీవల కాలం లో ప్రేమ అనేది కమర్షియల్ ఎలిమెంట్ గా మారి పోయింది. కేవలం అవసరాలను తీర్చు కోవడం కోసం మాత్రమే ఎంతో మంది ప్రేమ అనే ముసుగు వేసుకొని నాటకం ఆడుతున్నారు. అంతేకాదు ఏకంగా సినిమాల్లో నటిస్తున్న నటుల కంటే నిజజీవితంలో బాగా నటించడం నేర్చుకున్నారు చాలామంది జనాలు. ఈ క్రమంలోనే నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనేటట్లుగా నటించి ఇక అవసరాలు తీర్చుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇంకొంతమంది ప్రేమ అనే ముసుగులో ఏకంగా ప్రేమించిన యువతిని దారుణంగా హింసించడం లాంటివి చేస్తున్నారు నేటి రోజుల్లో. అయితే ఇలా ప్రేమ పేరుతో ఎంతో మంది యువకులు అమ్మాయిలను హింసించడం లాంటి ఘటనలు మాత్రమే చూసాము. కానీ అమ్మాయిలు కూడా అబ్బాయిలను దారుణంగా హింసిస్తారు అని నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇక ఎప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకే చెందినది అని చెప్పాలి. ఏకంగా తన ప్రియుడు మరొకరితో క్లోజ్ గా ఉండడాన్ని అస్సలు తట్టుకోలేకపోయింది ప్రియురాలు.



 చివరికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడిని.. దారుణంగా హింసించింది ఆ యువతి. ఈ ఘటన అర్జెంటినాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక ప్రియుడు మరొక యువతితో క్లోజ్ గా ఉండడంతో తట్టుకోలేకపోయిన యువతి.. అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఈ వాగ్వాదం తీవ్ర గర్షణకు దారితీసింది. ఇక కోపంతో ఊగిపోయిన ప్రియురాలు అతని గదిలో పెట్టి తాళం వేసింది మూడు రోజులు నీళ్లు కూడా ఇవ్వకుండా టార్చర్ చేసింది. అయితే ఎలాగోలా ప్రియుడు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాడు. ఇక పోలీసుల సహాయంతో అమ్మాయి భారీ నుంచి తప్పించుకోగలిగాడు ఆ యువకుడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: