- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పాన్ ఇండియా స్థాయిలో సంచలనాలు సృష్టించిన కొన్ని సినిమాల‌లో “కాంతార” ప్రత్యేక స్థానం సంపాదించింది. శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ఈ మాస్టర్‌పీస్‌తో రిషబ్ శెట్టి ఒకేసారి హీరోగానూ, దర్శకుడిగానూ నిలిచాడు. ఆ సినిమాకి వచ్చిన విశేషమైన విజయానంతరం ఇప్పుడు ఆ సినిమా ప్రీక్వెల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “కాంతార 1” పేరుతో విడుదలైన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా రిలీజ్ రోజునే భారీ హైప్‌ను సొంతం చేసుకుని ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తించింది. డే 1 నుంచే ఈ ప్రీక్వెల్ సాలిడ్ కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ వసూళ్లపై టీమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. దాంతో మొదటి రోజే 18 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించడం ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది.


రెండో రోజు మాత్రం ఊహించని రీతిలో వసూళ్లు తగ్గిపోవడం గమనార్హం. సాధారణంగా నార్త్ బెల్ట్‌లో విడుదలైన పాన్ ఇండియా సినిమాలకు, మొదటి రోజు తరువాత వర్కింగ్ డే వచ్చినా, టాక్ బలంగా ఉంటే వసూళ్లు పెరుగుతాయి. కానీ “కాంతార 1”కి మాత్రం రెండో రోజు కాస్త త‌గ్గింది. మొదటి రోజు 18 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టిన ఈ చిత్రం, రెండో రోజు కేవలం 13.5 కోట్లు మాత్రమే సాధించింది. సుమారు 5 కోట్ల వరకు వసూళ్లలో డౌన్‌ఫాల్ ఎదురైంది. ఈ తగ్గుదల కారణంగా ట్రేడ్ సర్కిల్స్‌లో కొంత ఆందోళన కనిపించినా... శనివారం, ఆదివారం వసూళ్లు మళ్ళీ పిక్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


వీకెండ్ హాలిడే అడ్వాంటేజ్‌తో కలిపి ఈ సినిమా మళ్ళీ గట్టి జంప్ చేసే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి మళ్లీ తన క్రియేటివ్ విజన్‌తో అద్భుతమైన అనుభూతి అందించిన ఈ సినిమా, కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉన్నందున మౌత్ టాక్ సానుకూలంగా కొనసాగుతోంది. ఇక వీకెండ్ కలెక్షన్లపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. మొత్తానికి, “కాంతార 1” మొదటి రోజు పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించినా, రెండో రోజు వసూళ్లు కాస్త తగ్గినప్పటికీ, రాబోయే రోజుల్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: