ఇటీవల కాలం లో మనిషి ప్రాణాలకు అసలు విలువే లేకుండా పోయిందా అంటే నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అవును అనే సమాధానమే చెబుతున్నారు. ఎందుకంటే నేటి రోజుల్లో టెక్నాలజీకి అనుగుణం గా మనిషి జీవన  శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. అంతేకాకుండా ఆధునిక సమాజంలో మూఢనమ్మకాలను వదిలేసి బ్రతకగలుగుతున్నాడు మనిషి  అంత బాగానే ఉంది కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే ప్రయత్నం చేయడం లేదు మనిషి. వెరసి ఇక చిన్న చిన్న కారణాలకే కృంగిపోతూ ఉన్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతోమంది. చిన్నచిన్న కారణాలకే చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. వెరసి ఇలా క్షణికావేషంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదఛాయలు అలముకుంటున్నాయి. ఇక ఇటీవలే మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ లో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఒక మహిళా చివరికి ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని భావించింది.



 స్వాతి అనే 30 ఏళ్ల మహిళ గత కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఈ క్రమంలోనే మనస్థాపం చెందింది. ఇక తన బాధ ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను పొంగిపోయేది. ఇక ఇటీవల క్షణికావేశంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఏకంగా విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యయత్నం చేసిన సమయంలో కుటుంబ సభ్యులు గమనించి.. మేడ్చల్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది స్వాతి. మృతురాలి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: