కావాల్సిన ప‌దార్థాలు: 
కొబ్బరి తురుము- ఒర‌ కప్పు
బియ్యం- ఒక కిలో
పసుపు- చిటికెడు
ఎండుమిర్చి- మూడు

 

పచ్చి మిర్చి- నాలుగు
నూనె- కావాల్సినంత‌
ఉప్పు- తగినంత
కరివేపాకు- మూడు రెబ్బ‌లు

 

ఆవాలు- ఒక టీ స్పూన్‌
జీలకర్ర- ఒక టీ స్పూన్‌
మినప‌ప్పు- ఒక‌టీ స్పూన్‌
సెనగపప్పు- ఒక టీ స్పూన్‌

 

తయారీ విధానం:
ముందుగా అన్నం కాస్త పలుకుగా వండి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, అందులో నూనె పోయాలి. అది కాగాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప‌ప్పు, సెన‌గ‌ప‌ప్పు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి వేసి వేయించాలి. 

 

ఇప్పుడు అందులో మిర్చి, కొబ్బరి తురుము, పసుపు వేసి వేగిన తర్వాత కరివేపాకు, ఉప్పు చిటపటలాడించి చివర్లో అన్నంలో వేసి కలిపితే కొబ్బరి అన్నం రెడీ.. దీన్ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో.. మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: