కావాల్సిన ప‌దార్థాలు:
దోసకాయ- ఒకటి
మెంతికూర కట్టలు- రెండు
పచ్చికొబ్బరి తురుము- పావుకప్పు

 

ఉల్లిపాయ- ఒకటి
కారం- చెంచా
ఉప్పు- తగినంత
పచ్చిమిర్చి- రెండు

 

పసుపు- కొద్దిగా
నూనె- రెండు చెంచాలు
తాలింపు గింజలు- చెంచా
కొత్తిమీర‌- కొద్దిగా

 

తయారి విధానం: ముందుగా పాన్‌లో నూనె వేడిచేసి పోపు గింజల్ని వేయించి ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు చేర్చాలి. అవి వేగాక మెంతిఆకులు వేసుకోవాలి. కాసేపటికి అవి మగ్గ‌నివ్వాలి. ఆ తరవాత దోసకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, వేసుకుని మూత పెట్టేయాలి. 

 

కూరముక్కలు బాగా మగ్గి నీరంతా పోయాక కొబ్బరితురుము కారం వేసి ఓ సారి తిప్పుకోవాలి. ఒక ఐదు నిమిషాలు మ‌గ్గ‌నిచ్చి చివ‌రిగా కొత్తిమీర కూడా వేసి క‌లిపి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ దోసకాయ మెంతికూర క‌ర్రీ రెడీ. వేడి వేడి రైస్‌లో దోసకాయ మెంతికూర వేసుకుని తింటే చాలా బాగుటుంది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: