కావాల్సిన ప‌దార్థాలు: 
మునగాకు- ఒక‌ కప్పులు
పచ్చికొబ్బరి- మూడు టీస్పూన్లు
ఆవాలు- అర టీస్పూను

 

నూనె- టేబుల్‌ స్పూను
పసుపు- అర టీస్పూను
మినప్పప్పు- ఒక టీ స్పూను

 

ఎండుమిర్చి- రెండు
ఇంగువ- అర టీస్పూను
ఉప్పు- రుచికి తగినంత

 

తయారీవిధానం: ముందుగా మునగాకును నీటితో శుభ్రం చేసి ఆరబెట్టాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని, నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసి, అవి వేగాక మునగాకు వేసి కాసేము వేయించాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు జ‌ల్లి మూతపెట్టి సన్నని సెగమీద ఉడికించాలి.

 

పది నిమిషాలయ్యాక కొబ్బరి తురుము, త‌గినంత ఉప్పు వేసి మరో రెండు నిమిషాలు మ‌గ్గించి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ మున‌గాకు ఇగురు రెడీ. ఈ మున‌గాకు ఇగురు పరోటాల్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. కాబ‌ట్టి ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: