కావాల్సిన ప‌దార్థాలు:
పనసకాయ ముక్కలు- అర కేజి
ఉల్లిపాయలు- మూడు
బాస్మతి బియ్యం- అర కేజి
దాల్చిన చెక్క- రెండు

 

బిర్యానీ ఆకు- మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్‌
నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు
బిర్యానీ మసాలా - ఒక టీ స్పూన్‌

 

కారం- అర టీ స్పూన్‌
లవంగాలు- మూడు
యాలకులు- రెండు
ఉప్పు- త‌గినంత‌

 

పచ్చిమిర్చి- మూడు
పెరుగు- అర‌క‌ప్పు
జీడిపప్పు- ప‌ది
కొత్తిమీర‌- అర‌క‌ట్ట‌
పుదీనా- కొద్దిగా

 

త‌యారీ విధానం: ముందుగా ప‌న‌స ముక్క‌ల‌ను తీసుకుని అందులో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి తగినంత నీరు పోసి సగం శాతం కుక్కర్లో ఉడికించాలి. మ‌రోవైపు బాస్మతి బియ్యం  70 శాతం ఉడికించి నీరు వంచేసి ఆరబెట్టాలి. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించి బౌల్‌లోకి తీసుకోవాలి. తర్వాత అదే పాన్ లో నెయ్యి వేసి మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్టు, పనస ముక్కలు, పుదీనా తరుగు, పెరుగు, ఉప్పు, బిర్యానీ మసాలా పొడి, సగం వేగిన ఉల్లిపాయ ముక్కలు, కారం ఒకటి తర్వాత ఒకటి వేగించుకోవాలి.

 

ఇప్పుడు ఆ ముక్కలపైన ఉడికించిన అన్నం పేర్చాలి. ఆ పైన మళ్లీ మిగిలిన ఉల్లి తరుగు, కొత్తిమీర, పుదీనా తరుగు చల్లి మూత పెట్టి చిన్నమంటపై పావు గంట ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ. వేడి వేడిగా దీన్ని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా మీరూ ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: