కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్- అర‌ కేజీ
బటర్- మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

మిరియాల పొడి- అర‌ టీ స్పూన్
మైదా పిండి- పావు కప్పు
ఆయిల్- మూడు టేబుల్ స్పూన్లు

 

నిమ్మ‌ర‌సం- అర క‌ప్పు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు
పుదీనా త‌రుగు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్‌ను నీటితో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలను ఒక బౌల్‌లో తీసుకుని వాటిపై ఉప్పు, మిరియాల పొడి చల్లి బాగా క‌ల‌ప‌డి. తర్వాత ముక్కల్ని మైదా పిండిలో ముంచి తియ్యండి. ఇప్పుడు స్ట‌వ్ మీద ఒక పాన్ పెట్టి.. అందులో ఒక‌ టేబుల్ స్పూన్ బటర్, ఒక‌ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి.

IHG

అది వేడి అయ్యాక‌ చికెన్ ముక్కల్ని అందులో వేసి మూడు, నాలుగు నిమిషాలు వేపండి. తర్వాత ముక్కల్ని తిరగేసి మళ్లీ  మూడు, నాలుగు నిమిషాలు వేగించాలి. బ్రౌన్ కలర్ వచ్చాక చికెన్ ముక్కలపై నిమ్మరసం వేసి అలా రెండు నిమిషాలు ఫ్రై చెయ్యాలి. ఇప్పుడు వాటిపై మిగిలిన బటర్ కూడా వెయ్యాలి. బటర్ కరిగే వరకూ ముక్కల్ని అటూ ఇటూ తిప్పి ఫై చేసుకోవాలి. 

IHG

ఇక చివరగా కొత్తిమీర, పుదీనా చల్లి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంటే నోరూరించే వేడి వేడి లెమన్ చికెన్ రెడీ అయినట్లే. సాధార‌ణంగా చికెన్‌ను చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. కానీ, ఎప్పుడు ఒక రెసిపీ అంటే కాస్త చిరాకు ప‌డ‌తారు. కాబ‌ట్టి.. ఎప్పుడూ ఒక రెసిపీనే కాకుండా పైన చెప్పిన‌ట్టు ఓ సారి లెమన్ చికెన్ కూడా ట్రై చేసి చూడండి. ఖ‌చ్చితంగా ఇష్ట‌ప‌డ‌తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: