కావాల్సిన ప‌దార్థాలు:
క్యాబేజీ- ఒక‌టి
బఠానీలు- ఒక క‌ప్పు
జీలకర్ర- అర టీ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

పచ్చి మిర్చి- మూడు 
టమాటో ప్యూరీ- ఒక క‌ప్పు
పసుపు- పావు టీ స్పూన్‌
కారం- ఒక టీ స్పూన్‌

 

ధనియాల పొడి- అర టీ స్పూన్‌
అల్లం త‌రుగు- అర టీ స్పూన్‌
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా క్యాబేజీని శుభ్రం చేసుకుని క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి వేడిచేయాలి. పాన్ వేడి అయిన తర్వాత నూనె వేసి .. జీలకర్ర వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లంతురుము వేసి వేయించాలి. ఈ ముక్కలు బాగా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని వేసి ప‌ది నిమషాల పాటు మ‌గ్గ‌నివ్వాలి.

 

క్యాబేజీ కాస్త‌ ఉడికిన తర్వాత‌.. అందులో బఠానిలు వేసి కలపండి. ఆ తర్వాత ఇందులో స‌రిప‌డా ఉప్పు వేసి మూత పెట్టి స్లో ఫ్లేమ్‌పై కాసేపు ఉడికించండి. ఆ త‌ర్వాత మూత తీసి.. అందులో టమోటా ప్యూరీ వేసి పదార్థాలన్నింటికీ పట్టేలా క‌లిపి మ‌ళ్లీ ఐదు నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపండి. 

 

ఆ తర్వాత మూత పెట్టి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించండి. క్యాబేజీ మ‌రియు బఠానీలు బాగా ఉడికాయి అనుకున్న త‌ర్వాత చివ‌రిగా కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేయండి. అంతే, వేడి వేడి నోరూరించే క్యాబేజీ బఠానీ క‌ర్రీ రెడీ అయినట్లే. రైస్ లేదా రోటితో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. సో.. ఈ టేస్టీ రెసిపీసి మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: