కావాల్సి ప‌దార్థాలు:
గుడ్లు- ఐదు
టొమాటో ప్యూరీ- ఒక‌ కప్పు
గరం మసాలా- ఒక టీ స్పూన్‌
కొబ్బరిపాలు- ఒక కప్పు

 

కారం- ఒక టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్క‌లు- ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు టీ స్పూనులు

 

శెనగపిండి- రెండు టీ స్పూన్లు
పసుపు- పావు టీ స్పూన్‌
జీలకర్ర- ఒక టీస్పూను 

 

నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి త‌గినంత‌
కొత్తిమీర త‌రుగు- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు గుడ్లను ప‌గ‌ల‌కొట్టి సొన వేసుకోవాలి. అందులో కాస్త సెనగపిండి, కొత్తిమీర తురుము, కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పెనం పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత కొద్దిగా నూనె.. వేడి అయ్యాక గుడ్డు మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా వేసి మూతపెట్టాలి. అరఅంగుళం మందంలో ఆమ్లెట్ తయారవుతుంది. 

 

అది చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్‌పై మ‌రో పాన్ పెట్టుకుని.. అందులో కాస్త నూనె వేయాలి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. అది వేగాక టోమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. అవి బాగా వేగాక కొబ్బరి పాలు వేసి బాగా క‌లుపుకోవాలి. తరువాత కప్పు నీళ్లు వేయాలి. 

 

కాసేపు మరిగాక కారం, పసుపు, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమం బాగా త‌గ్గిరప‌డ్డాక‌... ఆమ్లెట్ ముక్కలు వేసి కాసేపు ఉడికంచాలి. ఐదు నుంచి ప‌ది నిమిషాలు పాటు ఉడికించి.. చివ‌రిగా కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా మీరు కూడా ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెసిపీ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: