ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి... కీరదోసకాయ పచ్చడి అని పిలవబడినదే ఈ కుకుంబర్ డిష్ దీనిలో పులుపు, కారం, వగరు లాంటి రుచులన్ని ఉంటాయి. కీర దోసకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తాజా కీరదోసకాలతో చేస్తే మంచి సువాసన, రుచిని ఇస్తుంది. ప్రయోగాలు చేయట లో ఆసక్తి ఉన్నవారు కీరదోసకాయ బదులుగా పైనాపిల్‌తో కానీ పచ్చి మామిడికాయతో ఈ రెసిపీ ని చేసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ? పదండి..రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఈ రెసిపీ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కీర దోసకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్ధాలు....

ప్రధాన పదార్థం....

2  తురిమిన కీరా దోసకాయ
1 కప్ తురిమిన టెంకాయ

టెంపరింగ్ కోసం....

2 టీ స్పూన్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
1 టీ స్పూన్ జీలకర్ర
1 టీ స్పూన్ ఆవాల విత్తనాలు
అవసరాన్ని బట్టి కరివేపాకు
అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా

ప్రధాన వంటకానికి.....

అవసరాన్ని బట్టి ఉప్పు
6 ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు


రుచికరమైన మరియు ఆరోగ్యవంతమైన కీర దోసకాయ పచ్చడి తయారు చేయు విధానం...


మిక్సీలోకి తురిమిన పచ్చి కొబ్బరి, పచ్చి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర మరియా ఇంగువను వేసి పదార్దాలను మెత్తటి పేస్ట్ ని చేసికోండి.


పాన్ తీసుకోని అందులో కొద్దిగ నూనెను పోసుకొని వేడి చేయండి, నూనె కాగిన తరువాత కొద్దిగ ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు కరివేపాకులను వేసికొని అరనిమిషం లేదా ఒక నిమిషం పాటు వేయించండి.


ఇంకో బౌల్ తీసుకోని అందులో కీరాదోసకాయ తురుమును అలాగే ఇంతకు ముందు మిక్సీలో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని కావలసినంత ఉప్పుని కూడా వేసుకొని అన్ని పదార్దాలను బాగా కలుపుకోవాలి. అలాగే ఇంతకు ముందు చేసి పెట్టుకున్న తాలింపును వేసుకోండి.


అంతేనండి.. చూసారు కదా ఎంత సులువుగా కొన్ని నిముషాలలోనే రుచికరమైన రెసిపీ ఎలా తయారైపోయిందో. దీనిని చపాతి లోకి కానీ అన్నం తో పాటు ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి.

ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: