ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... భారత దేశం వివిధ వంటకాలకి పుట్టినిల్లు. భారతదేశంలోని అత్యంత రుచికరమైన స్వీట్ ఐటమ్ లలో బాగా రుచికరమైన ఐటమ్ అంటే అది గుర్ కా సందేశ్... గుర్ కా సందేశ్ అనేది బెంగాలీ స్వీట్. దుర్గా పూజ సమయాల్లో ఈ రెసిపీని ఎక్కువగా చేస్తుంటారు. ఈ రెసిపీ ఎంతో రుచికరంగా ఉంటుంది.

గుర్ కా సందేశ్ తయారు చెయ్యటానికి కావాల్సిన పదార్ధాలు.....

ప్రధాన పదార్థం...

1 లీటర్ ఫుల్ క్రీం మిల్క్...

3/4 కప్ బెల్లం...

పోపు కోసం.....

అవసరాన్ని బట్టి పిస్తా పప్పు.....

ప్రధాన వంటకానికి.....

1 టీ స్పూన్ వెనిగర్.....

అలంకారానికి.....

అవసరాన్ని బట్టి యాలకులు....

గుర్ కా సందేశ్ తయారు చేసే విధానం....

ముందుగా పాన్ తీసుకుని అందులో చిక్కని పాలు వేసి వేడిచేయండి. పాలు ఎప్పుడైతే పాలు వేడవ్వడం ప్రారంభం అవుతాయో అప్పుడు అందులో వెనిగర్ వేయండి. అప్పుడు విరిగిపోతాయి.

పాలు విరగగానే ఓ బౌల్ తీసుకుని అందులో ఓ శుభ్రమైన గుడ్డ వేసి దాని ద్వారా పాలని వడకట్టండి. ఇప్పుడు అందులో నుంచి వచ్చిన పన్నీర్‌ని తీసుకుని రెండు సార్లు చక్కగా కడగండి. ఇలా చేయడం వల్ల వెనిగర్ వాసన పోతుంది.

పన్నీర్ ముద్ద ఉన్న గుడ్డని బాగా పిండండి. ఇలా చేయడం వల్ల మిగిలన నీరు పోతుంది. ఇప్పుడులో క్లాత్ నుంచి పన్నీర్‌‌ని తీసి ప్లేట్‌లో వేసుకుని సరిగ్గా పిండిలా కలపండి.

ఇప్పుడు ఆ పన్నీర్ ముద్దకి యాలకుల పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి వేసి చక్కగా కలపండి. అంతే.. దీనిని ఎంతగా బాగా కలిపితే స్వీట్ అంతే మృదువుగా వస్తుంది. ఇలా తయారైన మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టండి. ఇలా తయారైన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పేపర్ కప్స్‌లో పెట్టండి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పిస్తా పప్పులతో గార్నిష్ చేయండి. ఇవి చల్లగా అయిన తర్వాత ఎంతో టేస్టీగా ఉంటాయి.

ఇలాంటి మరిన్ని కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


మరింత సమాచారం తెలుసుకోండి: