ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సౌత్ ఇండియాలో చిక్కుడుకాయలు ఎంతో ప్రసిద్ధమైనవి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కూడాను. చిక్కుడుకాయలతో అతి సులభంగా తయారు చేసే రెసిపీనే చిక్కుడు గింజల చట్నీ. ఈ పౌష్టిక మైన రెసిపీ ని కొన్ని నిముషాలలోనే తయారు చేసుకోవచ్చు. దీనిని వేడి వేడిగా ఉన్న అన్నం లోకి కానీ చపాతీ లోకి చాలా బాగుంటుంది. మరి ఈ రుచికరమైన రెసిపీని తాయారు చేసే విధానం ఎలాగో చూదామా.

చిక్కుడు గింజల చట్నీకి కావాల్సిన పదార్ధాలు...

ప్రధాన పదార్థం....

1/4 కిలోలు హయాసింత్ బీన్స్

ప్రధాన వంటకానికి....

అవసరాన్ని బట్టి రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
అవసరాన్ని బట్టి మిరియాలు
అవసరాన్ని బట్టి ఉప్పు
1 కప్ తురిమిన టెంకాయ
6 ఆకుపచ్చని పచ్చిమిరప కాయలు
1 అల్లం
టెంపరింగ్ కోసం
2 టేబుల్ స్పూన్ జీలకర్ర
1 టేబుల్ స్పూన్ ఆవాల విత్తనాలు
అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా
అవసరాన్ని బట్టి కరివేపాకు

చిక్కుడుగింజల చట్నీ తయారుచేయు విధానం చూడండి....

మిక్సీ జార్ ని తీసుకోని అందులోకి కొబ్బరి తురుము , జీలకర్ర, మిరియాలు, అల్లం మరియు పచ్చి మిరపకాలయను వేసుకొని కొద్దిగా గట్టి పేస్ట్ ని తయారు చేసుకోండి.

ఒక పాన్ ని తీసుకొని కొద్దిగా నూనెను వేసుకొని వేడి చేయండి. నూనె కాగిన తరువాత ఆవాలు, ఇంగువ మరియు కరోవేపాకును వేసికొని 2-3 నిముషాలపాటు వేయించుకోండి. ఉడికించిన చిక్కుడు గింజలను తీసుకోని ఒక పాన్ లోకి వేసుకొని కొంచెం సేపు వేయుంచుకోండి

ఇంతక ముందు మిక్సీ లో తయారు చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకోని అదే పాన్ లో వేసి బాగా కలుపుకోవాలి. ఇపుడు కావలసినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి, ఇలా కలిపిన తరువాత 2-3 నిముషాలు ఈ పదార్దాలను ఉడికించుకోవాలి.

అంతే..ఎంతో రుచికరమైన చిక్కుడు గింజల చట్నీ రెసిపీ తయారైపోయింది.ఇది వేడి - వేడి అన్నంలో లేదా చపాతీకి చాలా బాగుంటుంది.

ఇలాంటి మరెన్నో వంటకాలకు సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: