
రుచికరమైన పనీర్ పాయసం తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...
ప్రధాన పదార్థం....
1 కప్ పనీర్....
1 లీటర్ పాలు.....
ప్రధాన వంటకానికి....
1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి.....
1/4 టీ స్పూన్ పొడిగా చేసిన యాలకులు....
1/4 కప్ చక్కర పొడి....
అలంకారానికి...
10 కుంకుమ పువ్వు....
అవసరాన్ని బట్టి ముక్కలుగాా కోసిన బాదం....
అవసరాన్ని బట్టి తరిగిన పిస్తా పప్పు....
ఇక ఈ రుచికరమైన నోరూరించే పనీర్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి...
ఒక పెనంలో పాలను మరిగేదాకా కలుపుతుండండి. అందులో బియ్యంపిండి వేయండి ఇంకా ఆ మిశ్రమాన్ని 8-10 నిమిషాల వరకూ ఉడకనివ్వండి లేదా పాలు గట్టిపడేదాకా ఉడకనివ్వండి.
పాల మిశ్రమానికి డ్రైఫ్రూట్లు,ఏలకులు, కుంకుమపువ్వు రేకులు వేసి కలపండి. కొన్ని నిమిషాల తర్వాత, పంచదార వేసి మిశ్రమం గట్టిపడేవరకూ ఉడకనివ్వండి.
తక్కువ మంటలో, చిదిమిన పన్నీర్ ను వేసి 2-3 నిమిషాల పాటు బాగా కలపండి.
పాయసాన్ని దించి కప్పులలో వేడిగానో లేదా చల్లగానో వడ్డించండి. దాన్ని వడ్డించేముందు కుంకుమపువ్వు మరియు బాదంపప్పులతో అలంకరించి తర్వాత వడ్డించండి.
ఇలాంటి మరెన్నో కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా చాలా వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి....