ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ కుకింగ్ ఆర్టికల్ చదవండి. కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఏవైనా స్పైసి ఫుడ్ తిన్నప్పుడు ఉల్లిపాయలకు బదులు కీరదోసకాయని తీసుకోవడం చాలా మంచిది. ఇక కీరదోసకాయ పచ్చడి అని పిలవబడినదే ఈ కుకుంబర్ డిష్ దీనిలో పులుపు, కారం, వగరు లాంటి రుచులన్ని ఉంటాయి. 


తాజా కీరదోసకాయలతో చేస్తే మంచి సువాసన, రుచిని ఇస్తుంది. ప్రయోగాలు చేయట లో ఆసక్తి ఉన్నవారు కీరదోసకాయ బదులుగా పైనాపిల్‌తో కానీ పచ్చి మామిడికాయతో ఈ రెసిపీ ని చేసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం ? పదండి..రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.




తయారు చెయ్యాల్సిన విధానం...

మిక్సీలోకి తురిమిన పచ్చి కొబ్బరి, పచ్చి మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర మరియా ఇంగువను వేసి పదార్దాలను మెత్తటి పేస్ట్ ని చేసికోండి.పాన్ తీసుకోని అందులో కొద్దిగ నూనెను పోసుకొని వేడి చేయండి, నూనె కాగిన తరువాత కొద్దిగ ఆవాలు, జీలకర్ర, ఇంగువ మరియు కరివేపాకులను వేసికొని అరనిమిషం లేదా ఒక నిమిషం పాటు వేయించండి.ఇంకో బౌల్ తీసుకోని అందులో కీరాదోసకాయ తురుమును అలాగే ఇంతకు ముందు మిక్సీలో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని కావలసినంత ఉప్పుని కూడా వేసుకొని అన్ని పదార్దాలను బాగా కలుపుకోవాలి. 

అలాగే ఇంతకు ముందు చేసి పెట్టుకున్న తాలింపును వేసుకోండి.ఇక రుచికరమైన కీరదోసకాయ పచ్చడి తయారైపోయినట్లే.. ఈ పచ్చడి చపాతీలోకి గాని అన్నంలో గాని తినండి. మంచి టేస్టీ అనుభూతిని పొందుతారు. ఇలాంటి మరెన్నో వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: