ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. గారెలు ఎంత రుచికరంగా వుంటాయో అందరికి తెలిసిన విషయమే. చాలా క్రిస్పీగా బాగుంటాయి. అయితే మొక్క జొన్న తో గారెలు చేసుకుంటే వచ్చే మజానే వేరు. మొక్క జొన్న గారెలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మరి ఈ రుచికరమైన మొక్క జొన్న ఎలా చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

మొక్క జొన్న గారెలు తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...

మొక్కజొన్న పొత్తులు - రెండు,
ఉల్లిపాయ - ఒకటి,
మిర్చి - నాలుగు,
కొత్తిమీర - ఒక కట్ట (చిన్నది),
కరివేపాకు - రెమ్మ,
అల్లం - చిన్న ముక్క,
జీలకర్ర - ఒక టీ స్పూన్,
ఉప్పు- తగినంత,
నూనె - సరిపడినంత,
శనగపిండి- రెండు టేబుల్ స్పూన్స్,
కార్న్ ఫ్లోర్- రెండు టీ స్పూన్లు...
ఇవి కావాల్సిన పదార్ధాలు...

మొక్క జొన్న గారెలు తయారు చేయు విధానం....
ముందుగా చేసే ముందు మొక్కజొన్న పొత్తును ఒలచి పెట్టుకోవాలి. వీటికి తగినంత ఉప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసేప్పుడు నీటిని వాడకూడదు. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, మిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. కార్న్‌ఫ్లోర్ జతచేసి బాగా కలపాలి. ఒక వేళ పొత్తులు లేతగా ఉండి, పిండి పలుచగా అయితే శనగపిండి కలుపుకోవచ్చు.తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకొని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే వేడివేడిగా క్రిస్పీగా ఉండే మొక్కజొన్న గారెలు రెడీ అయినట్లే.. టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇంట్లో ట్రై చెయ్యండి..ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో వంటకాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: