ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. మన దేశం సాంప్రదాయ వంటకంగా స్వీట్ పొంగల్ ప్రసిద్ధి చెందింది.. స్వీట్ పొంగల్ ఎంత రుచికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎంత రుచికరంగా ఉంటుందో అంతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. స్వీట్ పొంగల్ మన దేశ సాంప్రదాయ వంటకం. దీన్ని ఇష్టపడని భారతీయుడు ఉండడు. ఇది చాలా తియ్యగా ఇంకా రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. దీనిలో వుండే పోషకాలు మరి దేంట్లోను వుండవు. ఇది చిన్న పిల్లల తింటే ఎంతో పుష్టిగా బలంగా ఉంటారు. ఇక పండుగలు, అలాంటి వేడుకలు వున్నప్పుడు దీనిని తింటే ఎంతో బాగుంటుంది..ఇక ఈ రుచికరమైన స్వీట్ పొంగల్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

స్వీట్‌ పొంగల్‌ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు...

కావలసినవి...
పాలు – 4 కప్పులు...
బియ్యం – కప్పు...
బెల్లం పొడి – కప్పు...
జీడిపప్పులు – 10...
కిస్‌మిస్‌ – 2 టేబుల్‌స్పూన్లు...
ఏలకుల పొడి – అర టీ స్పూను...
నెయ్యి – 6 టేబుల్‌ స్పూన్లు....
కొబ్బరి ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు...


స్వీట్ పొంగల్ తయారు చేసే విధానం....

ముందుగా పాలను తీసుకోండి.. ఆ  పాలను మరిగించాలి. తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి ∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి. ఐదు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి.బాణలిలో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్‌మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్‌లో వేసి బాగా కలపాలి.. తరువాత వేడివేడిగా వడ్డించుకొని తినండి.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాలు కోసం ఇండియా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..ఇంకా మరెన్నో రుచికరమైన వంటాకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి 

మరింత సమాచారం తెలుసుకోండి: