ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..మన భారతదేశం ఎన్నో వంటకాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో ఎక్కడ దొరకని రుచికరమైన ఆహారం భారతదేశంలో దొరుకుతుంది. అంత రుచికరమైన వంటకాలు మన భారతీయ వంటకాలు.ఇక గుజరాతి వంటకాలు ఎంత రుచికరంగా వుంటాయో అందరికి తెలిసిందే. అలాగే ఆరోగ్యానికి కూడా గుజరాతి వంటకాలు ఎంతో మంచివి.ఈకాలంలో గరంగరం దబేలీలను ఎంతో ఇష్టంగా తింటుంటారు గుజరాతీలు.ఈ వంటకం చాలా ఫేమస్.. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీన్ని ఇష్టపడని నార్త్ ఇండియన్ ఉండడు. మనం రోడ్డు పక్కన మిర్చిబజ్జీలు, పకోడీలు తిన్నట్టుగా వీటిని ఎంతో ఇష్టంగా ఆరగిస్తారు. ఈ కచ్చీ దబేలీ మసాలను ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు లేదా మార్కెట్లోనూ దొరుకుతుంది.ఇక ఈ రుచికరమైన గుజరాతి దబేలి ఫుడ్ ని ఇండియా హెరాల్డ్  అందిస్తున్న ఈ ఆర్టికల్ లో దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకోండి...


కావాల్సిన పదార్ధాలు...


ధనియాలు,
జీలకర్ర,
దాల్చిన చెక్క,
మిరియాలు,
లవంగాలు,
బిర్యానీ ఆకు,
ఎండు కొబ్బరి,
ఎండు మిర్చి,
నువ్వుల నూనె,
ఆమ్ చూర్ పొడి,
ఉప్పు తగినంత,
చింతపండు రసం,
నూనె తగినంత,
బంగాళాదుంప,
కొత్తిమీర,
కారపపూస,
దానిమ్మ గింజలు,
కొబ్బరి పొడి,
పల్లి...


దబేరి తయారు చేయు విధానం...


ముందుగా కొద్దిగా ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క, మిరియాలు, లవంగాలు, బిర్యానీఆకు, ఎండుకొబ్బరి తీసుకోవాలి. ఎండుమిర్చి, నువ్వులను నూనె లేకుండా వేయించాలి. చల్లారిన తర్వాత దీంట్లో ఆమ్‌చూర్‌ పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. తర్వాత కొద్దిగా చింతపండు రసం తీసుకుని కడాయిలో నూనె పోసి వేడిచేసి ఈ మిశ్రమాన్ని వేడిచేయాలి.దీంట్లో ఉడకబెట్టిన బంగాళాదుంపల మిశ్రమాన్ని కలిపి మెత్తని ముద్దలా చేయాలి. ఇంకా కొబ్బరిపొడి, కొత్తిమీర, కారప్పూస, దానిమ్మగింజలు, వేయించిన పల్లీలు వేయాలి. చాకుతో పావ్‌ మధ్యలో కొద్దిగా కోసి చెంచా బంగాళాదుంప మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు ఈ పావ్‌ను కడాయి మీద పెట్టి వేడిచేయాలి. చివరగా కారప్పూసలో ఈ పావ్‌ను దొర్లిస్తే నోరూరించే కచ్చీ దబేలీ సిద్ధమవుతుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: