రుచికరమైన పన్నీర్ గులాబ్ జామున్ తయారు చెయ్యడానికి కావల్సిన పదార్థాలు....
డ్రై మిల్క్ పౌడర్: 2 cup
రవ్వ: 2 Tsp
గుడ్డు: 1
పనీర్ తురుము లేదా చీజ్: 1 cup
పంచదార: 1 cup
నీళ్లు: 2cups
బేకింగ్ సోడ: 1/4th tsp
నూనె: ఫ్రై చేయడానికి
రుచికరమైన పన్నీర్ గులాబ్ జామున్ తయారు చేసే విధానం.....
ముందుగా నీళ్లలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి షుగర్ సిరఫ్ తయారయ్యే వరకూ చిక్కగా ఉడికించుకోవాలి.తర్వాతగ ఒక మిక్సింగ్ బౌల్లో సూజి(రవ్వ), చీజ్ తురుము, పాలపొడి మరియు గుడ్డు వేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకోవాలి.పది నిముషాలు పక్కన పెట్టి, అందులో నుండి కొద్దిగా కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడి అయ్యాక అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో పనీర్ ఉండలు వేసి డీప్ ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ లో డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ముందుగా తయారుచేసి పెట్టుకొన్న షుగర్ సిరఫ్ లో వేసి డిప్ చేయాలి.అంతే స్వీట్ రిసిపి రెడీ. 15-30నిముషాలు బాగా సోక్ అయిన తర్వాత సర్వ్ చేస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది.ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన పన్నీర్ గులాబ్ జామున్ మీరు ఇంట్లో ట్రై చెయ్యండి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి