ఇక ఇందులో భాగంగా ఇటువంటి నిబంధనలను పాటించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని అధికారులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఇద్దరు పోలీసులు విచక్షణ కోల్పోయి ఓ ఆటో డ్రైవర్‌పై తమ ప్రతాపం చూపారు. మాస్క్ సరిగా ధరించలేదని నడిరోడ్డుపై చితకబాదారు. ఈ ఘటన ఇండోర్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతేకాదు.. మాస్క్ సరిగా పెట్టుకోని ఒక ఆటో డ్రైవర్‌ను కిందపడేసి అతి దారుణంగా చితకబాదారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే ఆటో డ్రైవర్ కృష్ణ కెయర్(35) అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కలుసుకునేందుకు ఆసుపత్రికి వెళ్తున్నాడు. ఈ సమయంలో అతను మాస్క్ సరిగా పెట్టుకోలేదు. దీనిని గమనించిన ఇద్దరు పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌ను ఆపి, పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.
అయితే, ఆటో డ్రైవర్ అందుకు నిరాకరించాడు. దీంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌పై దాడికి దిగారు. అందరు చూస్తుండగానే ఆ వ్యక్తి కిందపడేసి చావబాదారు. ఇదంతా గమనించిన అక్కడున్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో పోలీసులు ఆటోడ్రైవర్‌పై దాడికి దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ మారడంతో పోలీసుల తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని దర్యాప్తునకు ఆదేశించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి