ప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌హ‌మ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. బ్లాక్ ఫంగ‌స్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో మందుల కొర‌త ఏర్ప‌డింది. దాంతో మందుల కొర‌త‌ను అదునుగా తీసుకుని కేటుగాళ్లు బ్లాక్ లో అమ్ముతున్నారు.  అయితే ఎవ‌రో చ‌దువుకోని వాళ్లు..ఆక‌తాయిలు మందుల‌ను బ్లాక్ లో అమ్మితే ఏమో అనుకోవ‌చ్చు...కానీ ప్రాణం విలువ భాగా తెలిసి.. వైద్యం చేయాల్సిన వైద్యుడు వ‌క్ర‌బుద్ధి ప్ర‌ద‌ర్శించాడు. బ్లాక్ ఫంగ‌స్ మందును బ్లాక్ మార్కెట్ చేస్తూ అమ్ముకుంటున్నాడు. విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో క‌ట‌క‌టాల పాల‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...ప్రగతి నగర్ లో ఉండే సెలోన్  లేబరేటరీస్ లో తయారయ్యే బ్లాక్ ఫంగస్ డ్రగ్ ఆంబిలాన్ 50ఎంజీ ని సంస్థ అనుమతి లేకుండా ఎర్రగడ్డ ESI ప్రభుత్వ ఆస్ప‌త్రికి చెందిన వైద్యుడు ఓబుల్ రెడ్డి అక్ర‌మంగా అమ్ముకుంటున్నారు. ఓబుల్ రెడ్డి తనకు తెలిసిన చింతల్ లోని నందిని మెడికల్ దుకాణం యజమాని వికాస్ రెడ్డి అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

మందులు అమ్మేందుకు ఒప్పందం చేసుకుని క‌మీష‌న్ మాట్లాడుకున్నాడు. కాగా వికాస్ రెడ్డి కొంత లాభంతో నాగరాజు అనే మ‌రో వ్య‌క్తి ద్వారా సుచిత్ర కు చెందిన మానస మెడికల్ దుకాణం నిర్వహకుడు శ్రీధర్ కి అమ్ముకునేవాడు. శ్రీధర్ దానిని ఆధారంగా చేసుకుని ఆన్లైన్ లో సెర్చ్ చేసి ఒరిజినల్ ఇంజక్షన్ సీసా పోలి ఉండే యాంటిబయోటిక్ డ్రగ్ సెఫిరాక్సిన్ టాజోబాక్ట‌మ్ ఫ‌ర్ ఇంజ‌క్ష‌న్ ఓల్సిఫోన్ దీని లేబుల్ ను తొల‌గించి ఆంబిలోన్ 50 ఎంజీ లేబుల్ స్టిక్కర్ వేసి అమ్మడానికి సిద్ధంగా ఉంచాడు. కాగా దీని పై పక్కా సమాచారం రావ‌డంతో మాదాపూర్ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ రామలింగరాజు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.18 లక్షల విలువగల (డ్రగ్స్, ఒక కారు, ఒక బైక్, 4ఫోన్లు, 5వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: