అలా కరోణతో చనిపోతున్నా ఈ శవాలను వీరు లాభార్జన కోసం ఉపయోగిస్తున్నారు. చివరికి డెడ్ బాడీ మీద ఉండే బంగారు ఆభరణాలను దొంగిలి స్తూ దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే కరోణ పేషెంట్లు చనిపోతే వారి డెడ్ బాడీ మీద ఉండే బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న దంపతులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి పది లక్షల రూపాయల విలువగల సొమ్మును రికవరీ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా ధర్మ పురానికి చెందినటువంటి చింతల రాజు 36 సంవత్సరాలు, మొదటి భార్యతో విడిపోయిన అతను నగరానికి వచ్చి ఉంటున్నాడు. 2017 లో మళ్లీ లత శ్రీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఎల్లంబండాలో నివాసం ఉంటున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి