బయటకు వెళ్లిన బాలికలు, మహిళలు, పిల్లలు, యువతులు ఇంటికి రాలేదని మిస్సింగ్ అయ్యారని  మనం తరచూ వింటూనే ఉంటాం. ఇలా మిస్సింగ్ అయిన వారిలో  చాలామంది అక్రమ రవాణాకు గురవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఎవరినైనా వెట్టిచాకిరి చేయించుకునేందుకు  డబ్బు ఆశ చూపి బలవంతంగా, మోసపూరితంగా వ్యవహరించి శారీరక ప్రయోజనాల కోసం  వాడుకోవడాన్ని మానవ అక్రమ రవాణా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి తెలియజేసింది. ఇలా అక్రమ రవాణా బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది మహిళలు బాలికలు పిల్లలే ఉంటున్నారు. మనదేశంలో  2018లో 5225 మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి.

 వీటిలో 64% స్త్రీలు, 18 సంవత్సరాలు నిండని  వయసుగల వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా బీహార్, తెలంగాణ, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి  అధిక శాతం ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు చెందిన వారు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. వీరంతా అధిక పేదరికం, బతుకుదెరువు కోసం వలసలు వెళ్లడం అక్కడ మధ్యవర్తుల మోసం చేయబడిన వారు, యుద్ధాలు కరువుకాటకాల ప్రకృతి వైపరీత్యాలు శరణార్థులు ఈ అక్రమ బారిన ఎక్కువగా పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని, కొంతమంది ముక్కుపచ్చలారని బాలికలు ప్రేమ పెళ్లిళ్ల పేరుతో మోసగాళ్ల చేతికి చిక్కి  వ్యభిచార కూపంలోకి  దిగజారి పోతున్నారు. కొంతమంది పురుషులు, బాలురు గనులు ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనిచేసేలా బలవంతంగా నెట్టబడుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో ఈ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

 చట్టాలు పటిష్టంగా అమలు కాకపోవడం  మానవ అక్రమ రవాణా అంతకంతకు పెరుగుతోంది. ఇలాంటి వారిపై లైంగిక దోపిడీ, వ్యభిచారం, బిక్షాటన, బలవంతపు వివాహాలు, దత్తత లు వెట్టిచాకిరి, అవయవాల దోపిడీతో ప్రపంచంలో పెద్ద వ్యాపారమే కొనసాగుతోంది. అక్రమ బాధితుల లిస్టులో 25 శాతం పిల్లలు ఉన్నట్టు యునిసెఫ్ తెలిపింది. ఈ రవాణాలు రెండో స్థానంలో ఆసియా ప్రాంతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ రవాణా కాబడిన మహిళలు శారీరక మానసిక ఆరోగ్య గురవుతూ డిప్రెషన్ లోకి వెళుతూ, హెచ్ఐవి ఇలాంటి రోగాల బారిన పడుతున్నారని నివేదిక తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: