ప్రస్తుత కాలంలో భూ వివాదాలు చాలా పెరిగిపోయాయి. ఆస్తుల కోసం భూముల కోసం ఎన్నో పంచాయతీలు జరుగుతున్నాయి. భూమి దగ్గర వచ్చే గొడవలు చాలా తీవ్రతరం అవుతున్నాయి. ఈ గొడవలో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల్లోనే ప్రాణాలు తీసుకుంటున్నారు. కొన్ని సంఘటనలు అయితే తల్లిదండ్రులనే కొడుకులు హతమారుస్తున్నారు. ఈ విధంగా సమాజం మొత్తం డబ్బులు, ఆస్తులు, అంతస్తులు ఇలా వీటి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చివరికి వాటి కొరకు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. క్షణికావేశంలో మర్డర్ లు కూడా చేసి కటకటాల పాలవుతున్నారు. అలాంటి సంఘటనలు దేశంలో రోజుకు ఎన్నో జరుగుతున్నాయి. ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు వేసినా ఆస్తులకే ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప, మనిషికి మనిషికి మధ్య ప్రేమానురాగాలు మాత్రం లేవనే చెప్పవచ్చు.

అలాంటి సంఘటనే  నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. సొంత అన్నదమ్ముల కుటుంబీకులే ఒకరినొకరు చంపుకున్నారు.  నల్గొండ జిల్లాలో జరిగిన ప్రతీకార మర్డర్ పట్టణంలో స్థానికంగా చాలా కలకలం రేపింది. నల్లగొండ జిల్లా సమీపంలోని అక్కలాయి గూడెంలో ఇద్దరూ అన్నదమ్ములే హత్యలకు గురయ్యారు. వీరికి భూ వివాదమే ప్రధాన కారణం. వివరాల్లోకి వెళితే ఆవుల లక్ష్మమ్మ , ఆవుల పాపయ్య ఇద్దరి దంపతులకు కాశయ్య 63 సంవత్సరాలు, రామస్వామి 57 సంవత్సరాలు, సోములు, సైదులు ఇలా నలుగురు కుమారులు ఉన్నారు. అయితే వీరి తల్లిదండ్రులు గతంలోనే నలుగురు కొడుకులకు  4.5 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచివేశారు. వారు ఎవరికి వారే వేర్వేరుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇందులో రెండవ కొడుకు కాశయ్య, మూడో కొడుకు రామస్వామి మధ్య గత కొద్ది రోజులుగా భూమి పంచాయతీ నడుస్తుంది. ఈ పంచాయతీ పెద్దమనుషుల సమక్షంలో వెళ్లినప్పటికీ సద్దుమణగలేదు. ఈ సందర్భంలో రామస్వామి తన బోరు మోటర్ వేసేందుకు  ఆదివారం పొలం వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్లేసరికి పొలం దగ్గర వేచి ఉన్న కాశయ్య కొడుకులు మహేష్, మల్లేష్ లు రామస్వామితో గొడవ పడ్డారు. ఈ గొడవ కాస్త చిలికి పెద్దది కావడంతో  వారు అక్కడే ఉన్నా ఒక రాయితో రామస్వామి తలపై బలంగా కొట్టారు. దీంతో రామస్వామి అక్కడికక్కడే కుప్పకూలి మృత్యువాత పడ్డాడు. రామస్వామి మృతిచెందాడని తెలుసుకున్న టువంటి అతని బంధువులు కోపంతో మాటువేసి మరీ  ఆదివారం అర్ధరాత్రి బాగా మద్యం తాగి గ్రామంలోకి వస్తున్నటువంటి కాశయ్యపై తీవ్రంగా దాడి చేశారు.

కర్రలతో బలంగా కొట్టారు. దీంతో కాశయ్య స్పాట్ లోనే మృతిచెందాడు. ఇలా ఇద్దరూ  అన్నదమ్ముల కుటుంబీకులు ఒకరికొకరు కిరాతకంగా హత్యలు చేసుకోవడంతో ఆ గ్రామం ఒకింత వణికిపోయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని రామస్వామి కొడుకు అయిన కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను విచా రించారు. ఇరు కుటుంబాల మధ్య ఈ గొడవ సాగుతున్నా  తాను ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నానని కిరణ్ పోలీసులకు తెలిపాడు. అయితే కిరణ్ చెప్పిన వివరాల ప్రకారం కొందరు దగ్గరి బంధువులు హత్యకు హత్య చేసినట్లు పోలీసుల వద్ద కిరణ్ చెప్పినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: