అర్ధరాత్రి ఆడపిల్ల ఎలాంటి భయం లేకుండా నడిరోడ్డుపై తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది. గాంధీ గారు చెప్పినట్లుగా ఆడపిల్ల అర్ధరాత్రి నడిరోడ్డుపై తిరుగుతుందా.. అర్ధరాత్రి కాదు ఈ కామపు సమాజంలో పట్టపగలు కూడా నడి రోడ్డుపై మహిళ దైర్యంగా తిరగలేక పోతుంది. రోజురోజుకు సభ్య సమాజంలో మంచి వాళ్ళ ముసుగులో బ్రతుకుతున్న కామాంధుల బారినపడి మహిళా బలి అవుతూనే ఉంది అయితే బయటికి వెళ్తే ఆకతాయిల నుంచి ఉద్యోగానికి వెళితే సహోద్యోగులు నుంచి పాఠశాలలో ఉపాధ్యాయులు నుంచి ఇంటికి వస్తే సొంత వాళ్ల నుంచి కూడా మహిళా వేధింపులు ఎదుర్కొంటూ ఉంటుంది.



 ఏదైనా సమస్య వస్తే కాపాడాల్సిన సొంత వాళ్లే ఏకంగా కామంతో ఊగిపోయి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తుంటే ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోయి భారంగా బ్రతుకు వెళ్లదీస్తున్నది మహిళ. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రస్తుతం సభ్య సమాజం తలదించుకుంటుంది. అయితే మహిళ అబల కాదు  ఒకసారి కోపం వస్తే ఆదిపరాశక్తి అవుతుంది అని నిరూపించేలా ఇటీవలి కాలంలో ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కన్న కూతురిలా చూసుకోవాల్సినా మామ కామం తో ఊగిపోయాడు.



 కోడలు వరసయ్యే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ కామాందుడి ప్రాణం పోయేంతవరకు వదల్లేదు. ఏకంగా తనపై అత్యాచారం చేసిన మామ పై కోపంతో రగిలిపోయి భోజనంలో ఎలకల మందు పెట్టి చంపింది  తమిళనాడులో వెలుగులోకి వచ్చింది  ఈ ఘటన. అయితే ఈ హత్య పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా కోడలే హంతకురాలు గా తేలింది. అయితే కొడుకు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. దీంతో కోడలికి పిల్లలు కావడం లేదు. ఇక ఇదే కారణంగా చూపుతూ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ కోడలు విచారణలో తెలిపినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: