నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్య సమాజం తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషుల కంటే కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవమృగాలు ఎక్కువై పోతున్నారు. దీంతో   ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు కోకొల్లలు వెలుగులోకి వస్తున్నాయి.  దీంతో ఆడపిల్ల నేటి సభ్యసమాజంలో ధైర్యంగా అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది.  బయటి వారి నుంచి మాత్రమే కాదు కాదు సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. ఆడపిల్ల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది.  మొన్నటివరకు ఆడపిల్లలపై అత్యాచారం జరిగింది. ఇక ఇప్పుడు మనిషి మూగజీవాలను కూడా వదలడంలేదు.



 మానవ మృగం కామపు కొరలకు మూగజీవాలు సైతం బలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి  ఇలా మూగజీవాల పై అత్యాచార ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.  ఇక్కడ ఏకంగా ఒక బాలుడి పై అత్యాచారం జరగడం సంచలనంగా మారిపోయింది. ఆరేళ్ల బాలుడి కి మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఏపీ లోని కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.  ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. డి కొండపల్లి శాంతి నగర్ లో ఆరేళ్ల బాలుడి పై లైంగిక దాడి జరిగింది.


 ఇందిరమ్మ కాలనీ కి చెందిన బాలుడు ఇంటివద్ద ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ కామాంధుడు అక్కడికి వచ్చాడు. ఇక ఆ బాలుడిపై అత్యాచారం చేసి కోరిక తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల బాలుడికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి మాయమాటలతో నమ్మించాడు. ఈ క్రమంలోనే  పక్కనే ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆ తర్వాత ఆరేళ్ల బాలుడిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక బాలుడు అస్వస్థతకు గురి కావడంతో ప్రస్తుతం గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడూ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: