సాధారణంగా ప్రతి యువతి కూడా పెళ్లి అంటే కోటి ఆశలు పెట్టుకుంటోంది. తనను మహారాణిలా చూసుకునే భర్త వస్తాడు అని కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే కొంతమంది యువతులు ఇక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. మరి కొంతమంది పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటారు.  వివాహం ఏదైనా ఆ యువతి కలలు కనడం మాత్రం కామన్. పెళ్లి తర్వాత ఎంతో సంతోషమైన జీవితాన్ని గడపాలి అని భావించి.. కొండంత ఆశతో మెట్టినింట్లో అడుగు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటుంది ప్రతి యువతి.


 ఇక తాళిబొట్టు మెడలో పడగానే ఓవైపు మెట్టినింట్లో అడుగు పెడుతున్నాను అని ఆనందం మరోవైపు పుట్టినింటి వారిని వదిలేస్తున్నా అనే బాధ యువతిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక యువతి పెళ్ళయిన కొన్ని నిమిషాలకు మెట్టినింటి వారికి పుట్టింటి వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఏకంగా పెళ్లయిన తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టాల్సింది పోయి ప్రియుడితో జంప్ అయ్యింది.  పెళ్లయిన కొద్ది సేపటికే భర్త ఇచ్చిన అన్ని రకాల బహుమతులను తీసుకున్న ఆ యువతి చివరికి ప్రియుడితో కలిసి వెళ్లి పోయింది.


 ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వట్టే పల్లి కి చెందిన యువతికి బెంగళూరుకు చెందిన యువకుడితో ఈనెల 17వ తేదీన పెళ్లి అయ్యింది. ఇక కానుకల కింద పెళ్లి కుమారుడు తన భార్యకు ఏకంగా 2 లక్షల విలువైన ఆభరణాలు అందించాడు. ఇక ఆ ఆభరణాలు తీసుకున్న తర్వాత తన భార్య ఎంతో సంతోష పెడుతుంది అని భావించాడు. కానీ భార్య మాత్రం భర్త కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. భర్త ఇచ్చిన అన్ని రకాల బహుమతులు తీసుకున్న తర్వాత  బయటకి వెళ్లి వస్తాను అంటూ చెప్పి ఏకంగా ప్రియుడితో పరారైంది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధిత కుటుంబీకులు ఆందోళన చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: