మామూలుగా అయితే ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఎంతోమంది ఆశ పడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రేమించిన వారిని మనసుని అర్థం చేసుకున్న వారిని పెళ్లి చేసుకుంటే ఇక జీవితం మొత్తం ఆనందంగా బ్రతకవచ్చు అని అనుకుంటారు.  ఈ క్రమంలోనే కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ పెద్దలను ఎదిరించలేక చివరికీ ప్రేమను వదులుకుంటారు. మరికొంతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని పెద్దలకు ఎలా చెప్పాలా అని మధన పడుతుంటారు.


  ఏదేమైనా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే మాత్రం అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది అని భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడికి మాత్రం ప్రేమ పెళ్లి శాపంగా మారి పోయింది. పెద్దలకు తెలియకుండా ప్రేమించాడు. ఇక పెళ్లి కూడా పెద్దలకు తెలియకుండానే చేసుకున్నాడు. కానీ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎలా చెప్పాలో తెలియక మదన పడిపోయాడు. ప్రతిరోజు ఇదే విషయంపై ఆలోచించి తీవ్ర మనస్తాపం చెందాడు.  ప్రేమ పెళ్లి చేసుకున్నాను అన్న ఆనందం కంటే కుటుంబ సభ్యులకు చెప్పలేదు అన్న బాధ అతని మనసును తొలిచేసింది. దీంతో కఠిన నిర్ణయం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.


 పెళ్లయిన పది రోజులకే ఆత్మహత్య చేసుకుని ప్రేమించిన యువతి జీవితాన్ని అంధకారంలోకి నెట్టిన  ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో వెలుగులోకి వచ్చింది. మండలంలోని సొంపల్లికి చెందిన హరినాథ్ పొన్నమండ లో బంధువుల ఇంట్లో ఉండేవాడు. ఇంటర్ చదివిన హరినాథ్ పొన్న మండలంకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు  ఇక ఇద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక ఇంట్లో వాళ్లకి చెప్పకుండానే ఈ నెల 10వ తేదీన రహస్యంగా వివాహం చేసుకున్నారు  హరినాథ్ తల్లి సోదరుడు విదేశాల్లో ఉంటున్నారు. ఇక వారికి తన ప్రేమ పెళ్లి విషయం ఎలా చెప్పాలో తెలియక ఎంతగానో మధన పడ్డాను హరనాథ్. చివరికి మనస్థాపం చెంది ఇటీవలే అమ్మమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వరుసకు సోదరుడైన రాజేంద్ర అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: