ప్రస్తుత సమాజంలో చిన్నారి బాలికలపై అఘాయిత్యాలు అనేది వెళ్లిపోయారు. కన్నతండ్రి, సొంత అన్న, బాబాయ్ ఇలా వావీ వరుసలు ఏమీ లేకుండా చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఆడపిల్లకు కనీసం ఇంట్లోనైనా భద్రత ఉంటుంది అంటే అది కూడా కరువైపోతుంది ప్రస్తుత సమాజంలో.. మగాడి చేతిలో మల్లెపూల నలిగిపోతున్న చిన్ని తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఈ విధంగా వావివరసలు లేకుండా తమ లైంగిక వాంఛకు  అడ్డు అదుపు లేకుండా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు కొంతమంది నీచులు. ఇలా దేశంలో ఎన్నో సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది తమ తమ కుటుంబ పరువు పోతుందని  బయటకు రాకుండా ఉంటున్నారు. అలాంటి ఓ సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. తండ్రిలా కాపాడవలసిన ఆ వ్యక్తి, తన పాలిట కాల యముడు లా ప్రవర్తించాడు..

నాన్నలా ధైర్యం చెప్పవలసిన ఆ వ్యక్తి  కిరాతకంగా వ్యవహరించాడు. దీంతో ఆ బాలిక జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి అని చెప్పవచ్చు. సమాజంలో ఆడ పిల్లలు తన నీడను కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుందని అర్థమవుతుంది. ఆడ పిల్లలు ఎంత అభద్రతతో ఉన్నారనేది  ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. సొంత బాబాయి ఆ బాలికపై లైంగికదాడి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం మండలంలోని గ్రామానికి చెందినటువంటి బాలిక పదో తరగతి పూర్తి చేసుకొని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నది. ఆమె ఒక చిన్న తాత  కొడుకు ఆ బాలిక పై కన్నేశాడు. తనకు వరసకు బాబాయి అయి ఉండి తండ్రిలా చూసుకోవాల్సిన వ్యక్తి కీచకుడిగా మారిపోయాడు. తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాలిక దగ్గరికి వెళ్ళాడు. కూల్ డ్రింక్ లో  మత్తు మందు కలిపి ఇచ్చి అమ్మాయి స్పృహ తప్పిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మొబైల్ ఫోన్ లో ఆ బాలిక బట్టలు లేకుండావీడియోలు, ఫోటోలు తీశాడు. ఆ బాలిక స్పృహలోకి  వచ్చిన తర్వాత తన న్యూడ్ వీడియో లు తీశానని ఎవరికైనా చెబితే అవి  సోషల్ మీడియా పెడతానని బెదిరించాడు.

 ఇలా బెదిరిస్తూ ఆ బాలికపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవలే ఆ బాలికకు తన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాన్ని కూడా కుదుర్చారు. దీంతో ఈ వ్యక్తి ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఈ వీడియోలు బయటపెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ వీడియోలు బయట పెడితే నీ తల్లిదండ్రుల ఆత్మహత్య చేసుకుంటారని బాలికను బెదిరించ సాగాడు. అతడే ఒక బెదిరింపులను తాళలేక చివరికి ఈ విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: