ఆడపిల్లలను బయటకు పంపాలంటే తల్లితండ్రులకు ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి ఘటనలు చూసి తల్లి తండ్రులు తమ ఇంటి ఆడపిల్లలను బయటకు పంపడానికి భయపడుతున్నారు. తోటి విద్యార్థినిని పదునైన పేపర్ కట్టర్ తో కడతేర్చాడు ఓ కామాందుడు. ఈ దుర్ఘటన కేరళలోని కొట్టాయం జిల్లా పాల ఏరియా లో చోటు చేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలోని తొలయోలపరంబు అనే ప్రాంతకు చెందిన నితినా మోల్ వయసు 22 పాల ప్రాంతం లో సెయింట్ థామస్ కాలేజీ లో చదువుతోంది. అదే జిల్లా కి చెందిన అభిషేక్ సెయింట్ థామస్ కాలేజీలో చదువుతున్నాడు.

IHG'office knife'; Classmate watching the  bleeding - Newsdir3

గత కొంత కాలం గా నితిన్ ను ప్రేమించమని వేధించేవాడు . తన కోరిక ను తీర్చాలని బెదిరించేవాడు. నితినా అతని బెదిరింపులకు లొంగలేదు. అతని ప్రేమను తిరస్కరించింది. దాంతో ద్వేషాన్ని పెంచుకున్న అభిషేక్ ఆమెను ఎలాగైనా కడతేర్చాలని అనుకున్నాడు . నితినా, అభిషేక్ ఇద్దరు పరీక్ష రాయడానికి పరీక్ష కేంద్రానికి వచ్చారు. అభిషేక్ ముందుగానే పరీక్షను ముగించుకొని పరీక్ష హాల్ బయట కాపు కాచాడు నితీనా పరీక్ష ముగించుకొని పరీక్షా హాల్ బయటకు రాగా ఒక్కసారిగా పదునైన పేపర్ కట్టర్ తో నితినా గొంతు కోసి హత్యాప్రయత్నం చేసాడు. కాలేజీ యాజమాన్యం నితినా ను హాస్పిటల్ కు తరలించారు. నితినా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడం తో చనిపోయింది. కాలేజ్ యాజమాన్యం ఫిర్యాదు తో అభిషేక్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
IHG

 ఇలాంటి దుర్ఘటనలు ముందు ముందు జరగకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సమాజంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా తమ జీవితాలను జీవించగలిన రోజే నిజమైన స్వతంత్రం వస్తుంది. గతంలో ఒక నిర్భయ ఒక దిశ లాంటి ఘటనలు దేశాన్ని ఒక్కసారిగా షాక్ కి గురిచేశాయి. ప్రభుత్వాలు ఈ సంఘటనల తర్వాత ఎన్నో చట్టాలు చేశాయి అయినప్పటికీ ఆడపిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు హత్యలు జరగకుండా ఆగటం లేదు. ఇకనైనా చట్టాలను అత్యంత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: