హిజ్రాలు నేటి సమాజంలో గౌరవం కోసం ఎంతగానో పోరాటం చేస్తున్నారు.. తమను చులకనగా చూడవద్దని తాము కూడా మనుషులమే అంటూ సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతున్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది హిజ్రాల మాత్రం గౌరవంగా ఉండే వారికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  సాధారణంగా చాలా మంది హిజ్రాలు ఇక రోడ్లపై వాహనదారులు దగ్గర డబ్బులు అడగటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా డబ్బులు అడిగినా సమయంలో వాహనదారులు డబ్బులు ఇవ్వకపోతే.. ఇబ్బందులకు గురి చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.


 కేవలం రోడ్డుపై సిగ్నల్స్ దగ్గర మాత్రమే కాకుండా కొన్ని కొన్ని సార్లు రైలు, బస్సు ప్రయాణాలలో కూడా హిజ్రాలు ప్రయాణికుల దగ్గర డబ్బులు వసూలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బులు ఇవ్వకపోతే సైలెంట్ గా వెళ్లి పోతే.. మరి కొంతమంది మాత్రం నానా రచ్చా చేస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చేంతవరకు కూడా తెగ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ హిజ్రా చేసినపని అభం శుభం తెలియని ఒక చిన్నారి ప్రాణం తీసింది. అస్వస్థతకు గురైన చిన్నారి తల్లి ఒడిలో నుంచి లాక్కుని డబ్బులు ఇచ్చేంతవరకు చిన్నారిని ఇచ్చేది లేదు అంటూ చెప్పింది హిజ్రా.


 చివరికి ముక్కుపచ్చలారని ఆ చిన్నారి హిజ్రా చేతిలో ప్రాణాలు వదిలింది   బెంగాల్ లోని మాల్దా జిల్లాలో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. బంగ్లా గ్రామంలో నివసించే మంపి సర్కార్ దంపతులకు అక్టోబర్ 29న ముగ్గురు పిల్లలు పుట్టారు. అయితే ఇటీవలే నవంబర్ 17వ తేదీన వీరి ఇంటికి హిజ్రాలు వచ్చారు. పిల్లలకు దీవెనలు ఇస్తామని 5000 ఇవ్వాలి అంటూ డిమాండ్ చేయడం గమనార్హం  అయితే తాము 5,000 ఇచ్చుకో లేము అంటూ కుటుంబ సభ్యులు తెలిపారు.. అంతలోనే ఔలాద్ అలీ  అనే హిజ్రా తల్లి చేతులో ఉన్న శిశువును ఒడిలోంచి లాక్కుంది. అయితే ఇలా శిశువును లాక్కో గానే తమ వద్ద ₹500 ఉన్నాయని ఇస్తాము అంటూ చెప్పిన కూడా వినిపించుకోలేదు. శిశువుకు నలతగా ఉందని పాలు పట్టాలి అన్నకూడా.. 5000 ఇచ్చేంత వరకూ బిడ్డ ఇచ్చేది లేదంటూ హిజ్రా చెప్పింది. చివరికి హిజ్రా చేతిలోనే ప్రాణం పోయింది. దీంతో తల్లి బోరున విలపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: